Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ..
నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి 'అఖండ' సినిమా గురించి గొప్పగా మాట్లాడింది.
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజుల తరువాత వెండితెరపై బాలయ్య విశ్వరూపం చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. అక్కడ మూడు రోజుల్లో రూ.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.
ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులూ చాలా మంది ఈ సినిమాను పొగుడుతూ పోస్ట్ లు పెట్టారు. తాజాగా బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. 'అఖండ' సినిమా ఒక అద్భుతమని.. అప్పుడు తాతగారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను పెంచితే.. ఇప్పుడు నానాన్నగారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను పెంచారని బ్రాహ్మణి వెల్లడించింది. గతంలో నాన్నగారు చేసిన అన్ని సినిమాలను మించి 'అఖండ' ఉందని బ్రాహ్మణి కామెంట్ చేసింది. తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం తనకు చాలా గర్వంగా ఉందని.. బ్రాహ్మణి చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువాళ్లు 'అఖండ' సినిమాను కచ్చితంగా చూడాలని బ్రాహ్మణి పిలుపునిచ్చింది.
ఈ ఏడాది ఆఖరిలో వచ్చినా.. 'అఖండ' సత్తా చాటుతోంది. ఈ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. బాలయ్యతో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఇక బాలయ్య తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. అలానే మరో రెండు, మూడు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో అనీల్ రావిపూడి సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు..
Also Read: షణ్ముఖ్ ఇక రియలైజ్ అవ్వడా..? సిరిని వదలడా..?
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి