Gurtunda Seetakalam Trailer: కొత్త కొత్త అందాలను మోసుకొచ్చి ఊపిరి ఆడకుండా చేసిన శీతాకాలం! గుర్తుందా?
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఇందులో కథానాయిక తమన్నా ఒక్కరే కాదు... మేఘా ఆకాష్, మరో అమ్మాయి కావ్యా శెట్టి కూడా ఉన్నారు. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. చూశారా?
''శీతాకాలం... మంచులో మనసులు తడిచి ముద్దయ్యే కాలం. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం. నా జీవితంలో శీతాకాలానికి ఇంకో పేరు ఉంది. సీజన్ ఆఫ్ మేజిక్'' అని సత్యదేవ్ అంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. అందులోని డైలాగ్ ఇది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో ఇద్దరు కథానాయికలు మేఘా ఆకాష్, కావ్యా శెట్టి కూడా ఉన్నారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కరితో హీరో ప్రేమలో పడినట్టు ట్రైలర్‌లో చూపించారు.
"మనసుతో ప్రేమించాలంటే ముందు కళ్ళతో చూడాలి కదా! అలా నా కళ్ళకి ఏ అమ్మాయి నచ్చినా... వెంటనే తనే నా లైఫ్ పార్ట్‌నర్ అనిపిస్తుంది. స్కూల్ డేస్‌లో కోమలి, కాలేజ్ డేస్‌లో అమ్ము, జర్నీలో దివ్య (క్యూట్, స్వీట్, ఫన్నీ, బబ్లీ... అబ్బాయిలు కోరుకునే టిపికల్ గాళ్ ఫ్రెండ్ మెటీరియల్. ఫైనల్‌గా నిధి... చూడగానే లవ్ లో పడలేదు. కానీ, నాకు తెలియనిది ఇంకేదో జరిగింది. ఇలా శీతాకాలం వచ్చిన ప్రతిసారీ కొత్త కొత్త అందాలను మోసుకొచ్చి నన్ను ఊపిరి ఆడకుండా చేసింది" అని హీరో చెబుతుంటే... విజువల్స్, మూడు ప్రేమకథలు అలా అలా వచ్చాయి. శీతాకాలంలో తనకు తారసపడిన వాళ్లలో లైఫ్ పార్ట్‌నర్ ఎవరు? అనే కన్‌ఫ్యూజన్‌లో... సమాధానం కోసం హీరో ఆలోచిస్తున్నట్టు ట్రైలర్ ముగించారు. ఇదొక మంచి విజువల్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ ట్రైలర్ కలిగించింది.
Also Read: బాలీవుడ్‌లో మరో విడాకులు - భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన 'బిగ్ బాస్' భామ రాఖీ సావంత్
View this post on Instagram
కన్నడ హిట్ 'లవ్ మాక్ టేల్' ఆధారంగా రూపొందుతోన్న 'గుర్తుందా శీతాకాలం' చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. ఆయనే నిర్మాత. ఎ. చినబాబు, ఎం.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల, సంగీతం: కాల భైరవ.
Also Read: 'ఎల్లమ్మా' - పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో కొత్త పాట! పాడింది ఎవరో తెలుసా?