Tamannaah on Seetimaarr Film: తమన్నా నోట బూతు డైలాగ్.. షాకైన ఫ్యాన్స్..
ఒకప్పుడు సినిమాల్లో బూతులు పెద్దగా కనిపించేవి కావు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది.
ఒకప్పుడు సినిమాల్లో బూతులు పెద్దగా కనిపించేవి కావు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. 'ఏ' సర్టిఫికెట్ వచ్చినా.. పర్వాలేదనుకొని బూతులు పెట్టేస్తున్నారు. వాటినే టీజర్, ట్రైలర్లలో చూపిస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. సన్నివేశాలు డిమాండ్ చేస్తున్నాయంటూ బూతులతో కథలను లాగించేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ లో ఎక్కువగా బూతునే ఉంటున్నాయి. సహజత్వం పేరుతో పాత్రలతో బూతులు పాలిస్తున్నారు. ఈ పంథా ఓ వర్గం ప్రేక్షకులకు అసలు రుచించడం లేదు.
Also Read : Bigg Boss Telugu 5: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. సరయు ఔట్..
అయితే సెన్సార్ ఉండదు కాబట్టి.. ఓటీటీ కంటెంట్ ను చాలా వరకు సెలెక్టివ్ గా, వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ థియేటర్లో ఫ్యామిలీతో పాటు వచ్చి చూసే సినిమాల్లో మాత్రం బూతుల విషయంలో కంట్రోల్ ఉండాల్సిందే. అయితే రీసెంట్ గా విడుదలైన 'సీటీమార్' అనే మాస్ సినిమాలో హీరోయిన్ తమన్నాతో బూతు మాట చెప్పించాడు దర్శకుడు సంపత్ రెడ్డి. కథ ప్రకారం.. సినిమాలో తమన్నా జ్వాలా రెడ్డి అనే తెలంగాణ అమ్మాయి పాత్రను పోషించింది.
ఆ పాత్రను ఈ తరానికి తగ్గట్లుగా కాస్త అగ్రెసివ్ గా చూపించాలనుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో 'లం..కొడుకు' అంటూ యధాలాపంగా ఓ బూతు మాట అనేస్తుంది తమన్నా. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఆమె నోట అలాంటి బూతు మాట వచ్చేసరికి థియేటర్లో జనాలు షాకయ్యారు. ఈ సినిమాలో మరో చోట పోసాని పాత్రతోనూ అదే బూతు మాట పలికించాడు సంపత్ నంది. అయితే 'సీటీమార్' లాంటి మాస్, ఫ్యామిలీస్ చూసే సినిమాల్లో ఇలాంటి బూతుల అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు సెన్సార్ ఎలా అప్రూవల్ ఇచ్చిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Sai Dharam Tej Accident: బైక్ రైడింగ్ వద్దని ఎన్నో సార్లు చెప్పా.... సీనియర్ నటుడు నరేష్
Also Read : Sai Dharam Tej Accident: అంతా విషాదంలో ఉంటే రాజకీయాలేంటి? నరేష్‌పై మండిపడుతున్న సినీ ప్రముఖులు..
Also Read : Sai Dharam Tej Medical Bulletin: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?