Tamannaah Bhatia: ఫస్ట్ డేట్‌లోనే శృంగారం? తమన్నా, విజయ్ బోల్డ్ కామెంట్స్ వింటే షాకవ్వడం ఖాయం
గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న తమన్నా, విజయ్ వర్మ సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఫస్ట్ డేట్ లో శృంగారం గురించి ఇద్దరూ పూర్తి వ్యతిరేక సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో తమన్నా, విజయ్ వర్మ హాట్ టాపిక్ గా మారారు. కొంత కాలంగా వీరిద్దరి గురించి బోలెడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గోవా వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తమ ప్రేమ గురించి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం విజయ్, తమన్నా కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. ఇందులో అడల్ట్ సీన్లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ మూవీలో పలువురు స్టార్ హీరోయిన్లు నటించినా... తమన్నా, విజయ్ క్యారెక్టర్ల మీదే ప్రేక్షకులకు మరింత ఆసక్తిక కలిగించింది. మూవీ ట్రైలర్ లో డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డ్ సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఫస్ట్ డేట్‌లోనే శృంగారంపై విజయ్, తమన్నా ఆసక్తికర సమాధానాలు
తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్, తమన్నా ఫస్ట్ డేట్‌లో శృంగారం గురించి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తాను ఎప్పుడూ ఫస్ట్ డేట్‌లోనే శృంగారంలో పాల్గొనలేదని తమన్నా చెప్పగా, విజయ్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ‘లస్ట్ స్టోరీస్ 2’లో నీనా గుప్తా చెప్పినట్లు పెళ్లి ముందు టెస్ట్ డ్రైవింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి? అనే ప్రశ్నకు కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. నీనా ఏదైనా కరెక్టుగానే చెప్తారు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ, తమన్నా ఆన్‌స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించారు. దీని కోసం రెండు దశాబ్దాలుగా ఫాలో అవుతున్న నో కిస్ పాలసీని కూడా తమన్నా బ్రేక్ చేసింది. ఈ విషయం గురించి మాట్లాడిన ఆమె, కాలానుగుణంగా మారే వ్యక్తుల్లో తాను ఒకదానినని తెలిపింది. ఒక నటిగా క్రియేటివిటీ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించానని చెప్పింది. వాటిలో పలు సినిమాలు బ్లాక్ బస్టర్ అయినట్లు వివరించింది.
నేటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో ‘లస్ట్ స్టోరీస్ 2’ స్ట్రీమింగ్
2018లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘లస్ట్ స్టోరీస్’ ఒకటి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది. ‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించనున్నారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు. 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తమన్నా, మృణాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు. ఇక ఇందులో తమన్నా, విజయ వర్మల మధ్య వచ్చే బోల్డ్ సీన్స్ మరింత ఘాటుగా ఉండబోతున్నాయి.