అన్వేషించండి

Devraj Patel Net Worth: చిన్న వయస్సులోనే యూట్యూబ్ కింగ్ అయ్యాడు - లక్షలు సంపాదిస్తున్న సమయంలో అనుకోని విషాదం, దేవరాజ్‌కు ఏమైంది?

చిన్న వయసులోనే యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయిన దేవరాజ్ పటేల్ కన్నుమూశాడు. 21 ఏండ్ల ఈ చత్తీస్ గఢ్ యూట్యూబర్ షూటింగ్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది యువతీ యువకులు తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. సరికొత్త ఆలోచనలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకడు  దేవరాజ్ పటేల్. చత్తీస్ గఢ్ కు చెందిన ఈ యువకుడు యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. చక్కటి కామెడీతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే వాడు.

రోడ్డు ప్రమాదంలో దేవరాజ్ పటేల్  మృతి

21 ఏళ్ల కమెడియన్‌, యూట్యూబ్‌ స్టార్‌ అయిన దేవరాజ్ పటేల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  రాయపూర్‌లో ఓ షూటింగ్‌కు వెళుతుండగా ఈ యాక్సిడెంట్‌ జరిగింది. లభందిహ్ ప్రాంతంలో అతడు ప్రయాణిస్తున్న బైక్ అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో దేవరాజ్ ప‌టేల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే  ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. కానీ, ఆయనకు తీవ్రమైన గాయాలు కావడంతో దారిలోనే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.

దేవరాజ్ పటేల్  మృతి పట్ల ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం సంతాపం

దేవరాజ్ పటేల్  మృతి పట్ల ప‌లువురు సినీ, రాజకీయ నాయ‌కులు సంతాపం తెలిపారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భఘేల్ దేవ‌రాజ్ పాత వీడియోను షేర్ చేసి అత‌డికి మృతికి సంతాపం తెలిపారు.  “మనందరినీ నవ్వించే దేవరాజ్ పటేల్ ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టారు. ఈ చిన్న వయస్సులో అద్భుతమైన టాలెంట్ ఉన్న యువకుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన లేని లోటును భరించే శక్తి ఆయన కుటుంబానికి, బంధు మిత్రులకు భగవంతుడు ప్రసాదించాలి. ఓం శాంతి.” అంటూ సీఎం భూపేష్ ట్వీట్ చేశారు.

దేవరాజ్ పటేల్ కుటుంబ నేపథ్యం!  

దేవ్‌రాజ్ ప‌టేల్ 2001లో మహాసముంద్ జిల్లా,  దాబ్ పాలి గ్రామంలో జన్మించాడు. తండ్రి ఘ‌న్ శ్యామ్ ప‌టేల్ రైతు. తల్లి గౌరీ పటేల్ గృహిణి. ఆయనకు ఓ సోదరి, ఓ సోదరుడు ఉన్నాడు. మొదట్లో దేవ్ రాజ్ యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ‌ర్ భువ‌న్ బామ్‌తో క‌లిసి ‘దింధోర’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్‌లో ‘దిల్ సే బురా లగ్తా హై భాయ్’ అనే డైలాగ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. 2021లో లక్ష మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడికి నాలుగు లక్షలకు పైగా  సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన తర్వాత సీఎం భూపేష్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తరచుగా ఇద్దరూ కలుస్తుండేవారు.   

యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ నికర ఆస్తుల విలువ ఎంత?

యూట్యూబ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న దేవ్ రాజ్ పటేల్, పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించాడు.  చనిపోయే సమయానికి అతడి నికర ఆస్తుల విలువ రూ. 10 లక్షలు. ఈ డబ్బు అంతా అతడు యూట్యూబ్ ద్వారానే సంపాదించినట్లు మిత్రులు చెప్తున్నారు.  

దేవ్‌రాజ్ పటేల్ చివరి వీడియో..

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devraj Patel (@imdevrajpatel)

Read Also: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే, ఒక్కో మూవీకి ఎంత వసూలు చేస్తారంటే?

టాప్ హెడ్ లైన్స్

Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
Love Oh Love OTT: 'లవ్ ఓ లవ్' ఓటీటీ రిలీజ్ డేట్... మూడు వారాలకే ధనుష్ మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్... ఎందులోనంటే?
OTT Movie: నాగదుర్గ లేటెస్ట్ సినిమా... మూడు వారాలకే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Purushaha OTT : ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget