News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Highest Paid Telugu Actresses: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే, ఒక్కో మూవీకి ఎంత వసూలు చేస్తారంటే?

తెలుగులో పలువురు హీరోయిన్లు వరుస హిట్లో బాగా రాణిస్తున్నారు. సక్సెస్ రేటును బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

FOLLOW US: 
Share:

తెలుగు హీరోయిన్ల మధ్య మంచి పోటీ ఉంటుంది. ఒకరికి మించి మరొకరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2023లో శ్రీలీల జోరు కొనసాగుతోంది. ‘ధమాకా’ హిట్ తో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. సుమారు డజను సినిమాట్లో హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే,  మందన్న కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. ఒక్కో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ఈ ఏడాది పారితోషికం బాగానే తీసుకున్నారు. ఇంతకీ తెలుగులో ఏ హీరోయిన్ ఎంత తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

1. పూజా హెగ్డే – ఒక్కో సినిమాకు రూ. 8-10 కోట్లు

మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ సినిమాలో పూజా హెగ్డేకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ, డేట్స్ కుదరకపోవడంతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య  నటించిన ‘ఒక లైలా కోసం‘ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది పూజా. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి ‘మొహెంజో దారో‘(2016)లో హీరోయిన్ గా చేసి హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆమె నటించిన ‘అలా వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ‘రాధే శ్యామ్’తో పాటు ‘ఆచార్య’ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.  

2. రష్మిక మందన్న – ఒక్కో సినిమాకు రూ. 6-10 కోట్లు

రష్మిక మందన్న ‘గీత గోవిందం’ చిత్రం మంచి పాపులారిటీ సంపాదించింది. ఇప్పుడు ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఆమె కన్నడ, తమిళం, తెలుగు, హిందీ సినిమా పరిశ్రమల్లో రాణిస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించింది.  ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటోంది.

3. సమంత- ఒక్కో సినిమాకు రూ. 6- 8 కోట్లు

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది సమంతా. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది.    

4. అనుష్క శెట్టి – ఒక్కో సినిమాకు రూ. 6-8 కోట్లు

‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ‘బాహుబలి 2’ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’లో నటిస్తోంది. అనుష్క 2005లో నాగార్జున నటించిన ‘సూపర్‌’ మూవీతో  సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘విక్రమార్కుడు’తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ‘అరుంధతి’లో జేజమ్మగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  

5. శ్రీ లీల – ఒక్కో సినిమాకు రూ. 4-5 కోట్లు

‘ధమాకా’ సినిమాతో శ్రీలీల దశ తిరిగిపోయింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పలువురు టాప్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు డజన్ సినిమాలు ఉన్నాయి.   

6. తమన్నా – ఒక్కో సినిమాకు రూ. 4-5 కోట్లు

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. 2005లో ‘శ్రీ’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ‘హ్యాపీ డేస్’ (2007) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తమిళంలోనూ పలు సక్సెస్ ఫుల్ సినిమాలతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.   

7. కాజల్ అగర్వాల్ – ఒక్కో సినిమాకు రూ. 3–4 కోట్లు

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్, మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.  అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  కాజల్ 2004 హిందీ చిత్రం ‘క్యూన్‌’తో  వెండితెరకు పరిచయం అయ్యింది. 2007లో వచ్చిన ‘చందమామ’ చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ‘మగధీర’ (2009) మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.  

8. కీర్తి సురేష్ – ఒక్కో సినిమాకు రూ. 3, 5 కోట్లు

ప్రస్తుతం కీర్తి సురేష్ ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటిస్తోంది.  తాజాగా ఆమె నటించిన ‘దసరా’ సినిమా మంచి హిట్ అందుకుంది. కీర్తి సురేష్ బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.  ఆమె తండ్రి నిర్మాణ సంస్థ రేవతి కళామందిర్ ద్వారా కొన్ని సినిమాలు, టీవీ షోలలో నటించింది. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకుంది.  

9. శృతి హాసన్ – ఒక్కో సినిమాకు రూ. 2- 3 కోట్లు

శృతి హాసన్ ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్లు అందుకుంది. అందులో ఒకటి ‘వాల్తేరు వీరయ్య’ కాగా, రెండోది ‘వీరసింహారెడ్డి’. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో కలిసి ‘సలార్’లో నటిస్తోంది.  రీసెంట్ ఈ సినిమాలో ఆమె షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.  

10. అనుపమ పరమేశ్వరన్ – ఒక్కో సినిమాకు రూ. 1-3 కోట్లు

క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ‘DJ టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తోంది. ఆమె ‘శతమానం భవతి’ (2017) సినిమాతో మంచి హిట్ అందుకుంది. ’కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజి పాపులారిటీ అందుకుంది. ’18 పేజెస్’ సినిమాతో సూపర్ హిట్ పొందింది.  

Read Also: సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి, ట్రైలర్‌కు ఇవ్వకపోవడమేంటి? CBFCపై '72 హూరైన్' టీమ్ ఆగ్రహం

Published at : 29 Jun 2023 12:11 PM (IST) Tags: Anushka Shetty Rashmika Mandanna Shruthi Haasan Tamannaah Keerthy Suresh Kajal Agarwal Sree leela anupama parmeswaran Samantha TOLLYWOOD Pooja Hegde Highest Paid Telugu Actresses Telugu Actresses Salary

ఇవి కూడా చూడండి

Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!

Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!

Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు

Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Animal Box Office: 'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?

Animal Box Office: 'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?

టాప్ స్టోరీస్

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం

CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం

Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం 51.89

Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం 51.89

Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!

Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!