(Source: ECI/ABP News/ABP Majha)
72 Hoorain Trailer: సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి, ట్రైలర్‌కు ఇవ్వకపోవడమేంటి? CBFCపై '72 హూరైన్' టీమ్ ఆగ్రహం
సంజయ్ పురాణ్ సింగ్ తెరకెక్కించిన '72 హూరైన్' చిత్రానికి షాక్ తగిలింది. ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిరాకరించింది.
సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం '72 హూరైన్'. పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా బృందానికి బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) షాక్ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీజర్ పై చెలరేగిన వివాదమే కారణమా?
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ తీవ్ర వివాదానికి కారణం అయ్యింది. ఈ టీజర్ ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లు ఉండటమే కాకుండా, ఉగ్రవాదానికి గల కారణాలపై ఎక్కువ ఫోకస్ చేశారనే విమర్శలు వచ్చాయి. ఈ చిత్రం పూర్తిగా ‘హురైన్ 72’ చుట్టూనే తిరగబోతున్నట్లు కనిపిస్తోంది. జీహాద్ కోసం ప్రాణాలు త్యాగం చేస్తే, స్వర్గంలో 72 మంది కన్యలు సేవలు చేస్తారనేది ‘హురైన్ 72’ ఉద్దేశం అని ఈ చిత్ర టీజర్ చెప్పడం వివాదానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు.
View this post on Instagram
సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి, ట్రైలర్ కు ఇవ్వకపోవడమేంటి?
‘హురైన్ 72’ సినిమా దర్శకుడు సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ సెన్సార్ బోర్డు నిర్ణయం పట్ల షాక్ అయ్యారు. “ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ పొందింది. ట్రైలర్ సినిమా గురించే చెప్తుంది. CBFC ఏ ప్రాతిపదికన ట్రైలర్‌ను తిరస్కరించిందో చెప్పాలి. ఈ సినిమాలో మేము వాస్తవాలనే చెప్తున్నాం. ఏ మతాన్ని మేం టార్గెట్ చేసుకోలేదు. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయదు" అని ఆయన తెలిపారు.
న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం
సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల నిర్మాత అశోక్ పండిట్ సైతం తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకుని సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించాలని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్, CBFC చైర్‌పర్సన్ ప్రసూన్ జోషికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. CBFC తీరు సృజనాత్మక స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని విమర్శించారు. బలమైన కారణం లేకుండా ట్రైలర్‌ను తిరస్కరించడం బాధాకరం అన్నారు. సెన్సార్ బోర్డు తీరును తాము సీరియస్ గా తీసుకుంటామన్నారు. అవసరం అయితే, కోర్టు మెట్లు ఎక్కుతామని తేల్చి చెప్పారు. I&B మంత్రిత్వ శాఖ తమ సినిమా విషయంలో జోక్యం చేసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.
View this post on Instagram
Read Also: ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి - మళ్ళీ కాలర్ ఎగరేసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్