అన్వేషించండి

Sunny Leone: పెళ్లికి ముందే అలా చేయడంతో... పాపం, సన్నీ లియోన్ అంత బాధ అనుభవించిందా?

తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన విషయాన్ని నటి సన్నీలియోన్ తాజాగా బయటపెట్టింది. పెళ్లికి ముందు కట్టుకోబోయే వాడు అన్న మాటలు విని తట్టుకోలేకపోయానని చెప్పింది.

Sunny Leone About Her Ex Boyfriend Cheating: అందాల తార సన్నీ లియోన్ గురించి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నీలి చిత్రాలతో కెరీర్ మొదలు పెట్టినా, ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ సినిమాల్లో నటిస్తున్నది. వరుస అవకాశాలతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కేవలం ఐటెమ్ సాంగ్స్ కే పరిమితం అయిన ఆమె, ఆ తర్వాత మంచి పాత్రలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. స్పిట్జ్ విల్లా సీజన్ 5కి హోస్ట్ గానూ వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్ లో ఆమె తన జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన గురించి చెప్పింది. ఆ మాటలు విని తన గుండె పగిలినంత బాధ అయ్యిందని వెల్లడించింది.

ఆ మాటలు విని గుండె బద్దలైంది- సన్నీలియోన్

సన్నీ లియోన్ ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి హ్యాపీగా జీవితాన్ని గడుపుతోంది. కొంత మంది పిల్లలను దత్తత తీసుకుని సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తోంది. అయితే, డేనియల్ కంటే ముందు తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అతడి వల్ల తాను జీవితంలో మర్చిపోలేని బాధను అనుభవించినట్లు వివరించింది. “వెబర్ కంటే ముందు నాకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత అతడిలో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందులా లేడు. ఎంతో అతడు తన విషయంలో ఏదో తప్పు చేస్తున్నాడు అనిపించింది. అంతే కాదు, నన్ను మోసం చేస్తున్నాడు అనే భావన కలిగింది. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. షాపింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. అన్ని పనుల కోసం అడ్వాన్స్ లు కూడా ఇచ్చాం. కానీ, రోజు రోజుకు అతడిలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ రోజు నాకు చాలా విసుగు అనిపించింది. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? నన్ను నిజంగానే ఇష్టపడుతున్నావా? అని అడిగేశాను. వెంటనే తను ఏమాత్రం వెనుకాడకుండా నీ మీద ప్రేమ లేదు అన్నాడు. ఆ మాటతో షాక్ అయ్యాను. ఆయన ఎందుకు అలా మాట్లాడాడో అస్సలు అర్థం కాలేదు. కానీ, చాలా రోజుల ఎంతో మనోవేదనకు గురయ్యాను. అతడి ఆలోచనల నుంచి బయటకు వచ్చేందుకు చాలా సమయం పట్టింది” అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.

వెబర్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం- సన్నీలియోన్

“బాధలో ఉన్న నా కోసం దేవుడు పంపించిన మంచి మనిషి నా భర్త వెబర్. అతడు నన్ను ప్రేమగా చూసుకోవడమే కాదు. మంచి చెడుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మా అమ్మానాన్న చనిపోయిన సమయంలో అన్ని రకాలుగా నాకు తోడుగా ఉన్నాడు. వెబర్ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయనతో ఇలాగే సంతోషంగా జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను” అని సన్నీ లియోన్ చెప్పింది.  

Read Also: బాక్సాఫీస్ దగ్గర టిల్లుగాడి ధూమ్ ధాం, 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget