అన్వేషించండి
Advertisement
యాక్టర్ అవ్వాలనుకునే డాక్టర్ - 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్!
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
'సమ్మోహనం', 'వి' సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి లిరికల్ సాంగ్స్, టీజర్ విడుదలయ్యాయి. అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ ని బట్టి యాక్టర్ అవ్వాలనుకునే ఓ డాక్టర్ స్టోరీనే ఈ సినిమా అని తెలుస్తోంది. హీరో సుధీర్ బాబు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. కృతిశెట్టి డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. తను కూడా ఓ డాక్టర్. ఆమెని హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటారు హీరో. కానీ ఆమె ఇంట్లో సినిమాలన్నా, సినిమా వాళ్లన్నా అసహ్యం. దీంతో తనతో సినిమా చేయాలనుకుంటే సుధీర్ బాబుకి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లి సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేష్ పనిచేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion