News
News
X

NYFCC award to RRR: ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి - న్యూయార్క్ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ అవార్డు అందుకున్న జక్కన్న

దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు గానూ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

ర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన న్యూయార్క్ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ (NYFCC) కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా అవార్డును దక్కించుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రానికి గానూ ఈ అవార్డు వరించింది. ఈ కార్యక్రమానికి జక్కన తన భార్య రమ, కుమారుడు కార్తికేయతో కలిసి వేడుకకు హాజరయ్యారు. అవార్డు అందుకున్న అనంతరం జక్కన్న ఇచ్చిన స్పీచ్‌కు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. 

అవార్డు తీసుకున్న సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. ఇప్పుడు దక్షిణాది నుంచి వస్తువున్న చిన్న సినిమాలను కూడా గుర్తించేలా చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇండియాలో RRR సినిమాకు ఎలా రియాక్ట్ అయ్యారో.. ఇక్కడ కూడా అలాంటి ఆదరణే లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులతో పాటు నా కుటుంబం కూడా ఒక కారణమే అన్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఆస్కార్ వరిస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ అది నిరాశగానే ఉండిపోయింది. కానీ రాజమౌళికి ఈ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ జ్యూరీ నుంచి అవార్డు దక్కడం మాత్రం ఆస్కార్ గెలిచినంత ఆనందాన్నిస్తోందని, ఆయన ఇలాంటి సినిమాలు మరెన్నో తీసి సౌత్‌ ఇండియా సినిమాను అగ్రస్థానంలో ఉంచాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల ప్రత్యేకతలు ఏమిటీ?

ఇంతకీ ఈ న్యూయార్క్ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఏంటంటే... పేరులో న్యూయార్క్ ఉన్నంత మాత్రాన ఈ అవార్డులు అక్కడి సినిమాలకు ఇస్తారు అనుకోవడం పొరపాటే. ఈ అవార్డుల అసోసియేషన్‌ అమెరికాదే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో తమదైన ప్రతిభను చాటుకున్న దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లకు అవార్డులు ఇస్టుంటారు. ఈ అవార్డ్ అసోసియేషన్‌ను 1935లో స్థాపించారు. ఈ అసోసియేషన్‌లో న్యూయార్క్‌కి చెందిన పలు వార్తా పత్రికలకు చెందిన 30 మంది క్రిటిక్స్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తుంటారు. వారంతా కలిసి కొన్ని సినిమాలను ఎంపికచేసి ఏ సినిమాకు ఏ క్యాటగిరీలో అవార్డు ఇస్తే బాగుంటుందో చర్చించి అప్పుడు అవార్డులు ఇస్తుంటారు. దాదాపుగా ఆస్కార్‌ రేంజ్‌లోనే ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుంది. అలా ఈ అసోసియేషన్‌ నుంచి అవార్డు అందుకున్న మొదటి చిత్రం ‘ది ఇన్‌ఫార్మర్‌’. 1936లో ఈ సినిమాకు అవార్డు లభించింది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే కాకుండా అమెరికాతో పాటు రష్యా, జపాన్‌లోనూ రికార్డులు కురిపించింది. ఇటీవల తారక్, రామ్‌ చరణ్‌ తమ ఫ్యామిలీతో కలిసి ఆర్‌ ఆర్‌ ఆర్‌ స్పెషల్‌ షో కోసం జపాన్‌ కూడా వెళ్లారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు. ఇది ప్రపంచాన్ని చుట్టే ఓ అడ్వెంచరర్‌ కథ ఆధారంగా ఉంటుందని జక్కన్న హింట్‌ కూడా ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Also: సమ్మర్‌లో శర్వానంద్ షాదీ! వధువు ఎవరో తెలుసా?

Published at : 05 Jan 2023 01:31 PM (IST) Tags: RRR Rajamouli RRR Awards NYFCC NYCC Award to Rajamouli

సంబంధిత కథనాలు

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

K Viswanath Death: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్

Gruhalakshmi February 3rd: ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయేందుకు అభి ప్లాన్- నందు వ్యాపారానికి లాస్య కండిషన్

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!