News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SreeLeela 1st Look Dhamaka: మాస్ మహారాజ రవితేజతో శ్రీలీల, ఫస్ట్ లుక్ వచ్చింది! చూశారా?

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ధమాకా'. ఇందులో 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ ట్యాగ్ లైన్ వెనుక కారణం అదే. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. ఓ కథానాయికగా 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల (Sree Leela) నటిస్తున్నారు. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'ధమాకా' సినిమాలో ప్రణవి పాత్ర (Sree Leela As Pranavi, First Look From Dhamaka) లో శ్రీలీల పాత్రలో నటిస్తున్నట్టు చిత్రబృందం తెలియజేసింది. రవితేజతో పాటు ఓ గోడ మీద కూర్చున్న పల్లీలో, బఠాణీలో తింటున్న శ్రీలీల స్టిల్‌ను విడుదల చేశారు. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది. త్రినాథ రావు నక్కిన, ప్రసన్నకుమార్ బెజవాడ కలయికలో వచ్చిన సినిమాల్లో వినోదం ఎక్కువ ఉంటుంది. వాళ్లిద్దరూ రవితేజ శైలికి తగ్గ కథను సిద్ధం చేసుకుని ఈ సినిమా చేస్తున్నారట.

Also Read: ‘ఖిలాడి’ రివ్యూ: ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్టులెన్నో! అవి ఎలా ఉన్నాయి? సినిమా ఎలా ఉంది?

View this post on Instagram
 
A post shared by Sreeleela (@sreeleela14)

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: భీమ్స్ సిసిరిలియో, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని

Also Read: బాలీవుడ్‌లో మరో విడాకులు - భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన 'బిగ్ బాస్' భామ రాఖీ సావంత్

Published at : 14 Feb 2022 12:00 PM (IST) Tags: raviteja Sree Leela First Look Dhamaka Sree Leela As Pravani In Dhamaka Dhamaka Movie Dhamaka Look Sree Leela

ఇవి కూడా చూడండి

Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?

Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?

Bigg Boss Season 7 Day 18 Updates: ఒక్కటైన ప్రియాంక, శోభ - ప్రిన్స్‌కు మళ్లీ షాక్, లోన్ తీసుకొని వచ్చానంటూ కన్నీళ్లు

Bigg Boss Season 7 Day 18 Updates: ఒక్కటైన ప్రియాంక, శోభ - ప్రిన్స్‌కు మళ్లీ షాక్, లోన్ తీసుకొని వచ్చానంటూ కన్నీళ్లు

Gandharvudu Jr: జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!

Gandharvudu Jr:  జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!

Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?

Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?

Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!

Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత