Spider Man Trailer: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్.. డాక్టర్ స్ట్రేంజ్ ఎంట్రీ, ఆ సూట్ ఐరన్ మ్యాన్‌దా?
స్పైడర్ మ్యాన్: నో వే హో ట్రైలర్ వచ్చేసింది. మరిన్ని యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు గుడ్ న్యూస్. సోనీ పిక్చర్స్ సంస్థ మంగళవారం (ఆగస్టు 24) ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ సినిమా టీజర్ ట్రైలర్‌ను తెలుగులో విడుదల చేసింది. జాన్ వాట్స్ నిర్మించిన ఈ ‘స్పైడర్ మ్యాన్’ సీరిస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. హీరో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ‘డాక్టర్ స్ట్రేంజ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ట్రైలర్ ప్రకారం.. స్పైడర్ మ్యాన్ ఎవరనేది ప్రపంచానికి తెలిసిపోతుంది. దీంతో స్పైడర్ మ్యాన్ చిక్కుల్లో పడతాడు. మిస్టీరియో హత్య కేసు స్పైడర్ మ్యాన్‌కు చుట్టుకుంటుంది. ఈ చిత్రానికి ముందు సీరిస్‌లో మిస్టీరియోనే విలన్. అందులో అతడు డ్రోన్ల ద్వారా వింత ఆకారాలను సృష్టిస్తాడు. వాటిని అంతం చేసి ప్రజలను కాపాడుతున్నట్లుగా నటిస్తాడు. దీంతో అంతా అతడిని సూపర్ హీరో అని అనుకుంటారు. ఈ కుట్రను కనిపెట్టిన స్పైడర్ మ్యాన్ అతడితో పోరాడతాడు. ఈ క్రమంలో మిస్టీరియో చనిపోతాడు. దీంతో ప్రజలంతా స్పైడర్ మ్యాన్‌ను శత్రువులా చూస్తారు. పైగా స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కరే అని తెలిసిపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ‘నో వే హోమ్’ సీరిస్‌లో ఈ కథే నడుస్తుంది.
ఈ సమస్యల నుంచి తనను బయటపడేయాలంటూ పీటర్ పార్కర్ డాక్టర్ స్ట్రేంజ్‌ను ఆశ్రయిస్తాడు. తానే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలని కోరతాడు. దీంతో డాక్టర్ స్ట్రేంజ్.. జనాలు పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని మరిచిపోయేలా చేస్తాడు. కానీ, అప్పటి నుంచి అసలు సమస్యలు మొదలవుతాయి. పీటర్ పార్కర్‌కు పాత శత్రువులు మళ్లీ ఎదురవుతారు. ఈ సమస్యలను పీటర్ పార్కర్ ఎలా ఎదుర్కొంటాడనేది బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. అయితే, ఇందులో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ సూట్‌కు టెక్నాలజీ తోడైంది. దీన్ని చూస్తే.. ‘ఐరన్ మ్యాన్’ తయారు చేసిచ్చిన సూట్‌లాగానే ఉంటుంది. తాను కోరుకున్నప్పుడు స్పైడర్ మ్యాన్‌లా మారిపోయే విధంగా ఈ సూట్ ఉంటుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్పైడర్ మ్యాన్ తెలుగు ట్రైలర్ చూసేయండి మరి.
స్పైడర్ మ్యాన్.. నో వే హోమ్ ట్రైలర్:
Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!
Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?
Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్