‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!
నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లవ్‌స్టోరీ’ విడుదల తేదీ రోజునే ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం న్యాయం కాదన్నారు.
హీరో నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదల వివాదం ముదిరి పాకాన్న పడింది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే తమ డిమాండ్‌ను పక్కన పెట్టి.. ఓటీటీలో విడుదలకు సిద్ధం కావడం న్యాయం కాదంటూ ఎగ్జిబిటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్న రోజునే.. నాని నటించిన ‘టక్ జగదీష్’ను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవడాన్ని సైతం తప్పుబట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఎగ్జిబిటర్లంతా సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎగ్జిబిటర్లు.. నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ‘టక్ జగదీష్’ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నాని బాధ్యతగా స్పందించాలని, లేకపోతే భవిష్యత్తులో మేమంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ‘తిమ్మరుసు’ ఆడియో వేడుకలో నాని మాట్లాడుతూ తన థియేటర్‌లో విడుదల కావడమే తనకు ఇష్టమని, ఓటీటీలో వల్ల నష్టమేనని వ్యాఖ్యానించారని, ఆ మాటలు విని ఓటీటీ వాళ్లు.. ‘టక్ జగదీష్’ నిర్మాతలు అడిగిన దానికంటే రూ.4 కోట్లు ఎక్కువ ఇచ్చి ఆ సినిమాను తీసుకున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. ‘‘హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజు ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పండుగ రోజుల్లో ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం వల్ల అంతా నష్టపోతాం. ఇప్పటికైనా ‘టక్ జగదీష్’ నిర్మాతలు నిర్ణయం మార్చుకోవాలి. ఆ ఓటీటీ సంస్థతో మాట్లాడి ‘టక్ జగదీష్’ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఓటీటీ వల్ల భవిష్యత్తులో నిర్మాతలకే ప్రమాదమని, డిస్ట్రీబ్యూటర్లు నిర్మాతలకు డబ్బులు కట్టరని పేర్కొన్నారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేయడానికి ముందు ఎగ్జిబిటర్ల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని తెలిపారు. మల్టీఫ్లెక్స్ యాజమాన్యం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైతే ఓటీటీల్లో సినిమా వేస్తారో.. వారి సినిమాలపై లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదని హెచ్చరించారు.
Also Read: అయ్యో నాని.. ‘శ్యామ్ సింగరాయ్’పై అసత్య ప్రచారం.. ‘టక్ జగదీష్’పై ఆగ్రహ జ్వాలలు!
ఇటీవల ‘టక్ జగదీశ్’ మూవీపై నాని చేసిన ట్వీట్.. నేపథ్యంలో థియేటర్ యాజమానులు ఇలా తమ నిరసన వ్యక్తం చేశారు. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలపై వస్తున్న ప్రచారానికి నాని ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్‌లో నిలబడినట్టు అయ్యిందని తెలిపాడు. సినీ అభిమానిగా తనకు కూడా ప్రేక్షకులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు ఇష్టమని నాని లేఖలో పేర్కొన్నాడు. ‘టక్ జగదీశ్’ మూవీని థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తీశామన్నాడు. కానీ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోకపోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయాన్ని వారికే వదిలేశానని తెలిపాడు. నిర్మాతలు థియేటర్లలో రిలీజ్‌కు అంగీకరిస్తే మొదట సంతోషించేది తానని నాని పేర్కొన్నాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా.. సహకరిస్తానని, తుది నిర్ణయం వారిదేనని తెలిపాడు.
Also Read: ఉత్తమ నటిగా సమంత.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అక్కినేని కోడలు
Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత
Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్