By: ABP Desam | Updated at : 21 Dec 2021 08:14 PM (IST)
Star Maa Music/YouTube
‘బిగ్ బాస్’ సీజన్ 5లో ఐదు స్థానంలో ఎలిమినేటై హౌస్ నుంచి బయటకు వచ్చిన సిరి.. ‘స్టార్ మా’ మ్యూజిక్‌లో ప్రసాదరమయ్యే ‘బిగ్ బాస్ బజ్’ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్ అరియానా అడిగిన ప్రశ్నలకు టక టకా సమాధానాలు చెప్పేసింది. సిరితో అరియానా ఇంటర్వ్యూ సాగిందిలా..
టాప్ 5లోకి చేరిన తర్వాత.. వేరొకరు విన్ కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అరియానా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గెలిచేయాలి అనేంత ఆలోచన చిన్నప్పటి నుంచి లేదు. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి చనిపోయాక అమ్మ కష్టపడి పెంచింది. అది కావాలి.. ఇది కావాలని కోరుకొనేదాన్ని కాదు. చిన్నప్పుడే ఆ ఆశ చచ్చిపోయింది. అందుకు ఆ మాట అలా వచ్చేసింది నా హార్ట్ నుంచి’’ అని తెలిపింది.
సన్నీని టార్గెట్ చేసుకున్నావా?: హౌస్‌లో నేను, షన్ను.. చాలా జెన్యూన్‌గా ఉన్నాం. ఎక్కడా నటించలేదు. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం. బిగ్ బాస్ హౌస్‌లో మోజ్ రూమ్‌ను బాగా మిస్ అవుతున్నా. హౌస్‌లో సన్నీ నన్ను బాగా అపార్థం చేసుకున్నాడు. అయితే, నేను అతడిని టార్గెట్ చేసుకున్నా అనడంలో నిజం లేదు. గేమ్ కూడా నేను ఒంటరిగానే ఆడాను. సన్నీ నన్ను బాగా అపార్థం చేసుకున్నాడు. నేను ఎప్పుడూ అతడిని టార్గెట్ చేయలేదు. గేమ్ ఎప్పుడూ నేను ఒంటరిగానే ఆడాను.
రవిని నామినేట్ చేసింది నువ్వే.. మళ్లీ రవి మీ కోసమే ఆడుతున్నా అన్నావెందుకు?: రవి ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు. ఆ రోజు షాకయ్యాం. అయితే, రవిని అప్పుడు ఎలిమినేట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఆ వారంలో రవితో నాకు ఒక సమస్య ఉంది. నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నావ్ అని రవి అన్నాడు. అయితే, రవి వెళ్లిన తర్వాత మేం చాలా డల్ అయిపోయాం. అతడిని మిస్సయ్యాం. నువ్వు చాలా స్ట్రాంగ్, తప్పకుండా టాప్-5లో ఉండాలి అనేవాడు. అందుకే.. నీ కోసం ఆడుతున్నా రవి అన్నాను.
షన్నుతో క్లోజ్‌గా లేకపోతే టాప్ 3లో ఉండేదానివా?: షన్ను వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు. తాను లేకపోతే నేను ఎలా ఆడేదాన్నో ఏమో అని ఎప్పుడూ అనుకోలేదు. నా గేమ్‌లో ఎప్పుడూ అతడిని ఇన్వాల్వ్ చేయలేదు. ఇక సన్నీ విషయానికి వస్తే.. షన్నుకు నచ్చడం లేదని నేను అతడిని దూరం పెట్టలేదు. ఇప్పుడు చెబితే ప్రేక్షకులు నమ్ముతారో లేదో. బయట సన్నీ నాకు మంచి ఫ్రెండ్. ఫినాలే వీక్‌లో సన్నీ.. ‘‘నువ్వు ఓడిపోయావ్’’ అన్నందుకే నాకు కోపం వచ్చింది. సన్నీది చిన్నపిల్లాడి మెంటాలిటీ. అతడికి కోపం ఎక్కువ. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో అది తగ్గించుకున్నాడు.
Also Read: కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..
షన్నుకు నుదుటి మీద ముద్దుకు ఎందుకు పెట్టావ్?: ‘బిగ్ బాస్’ హౌస్‌లోనే కాదు.. బయట కూడా షన్నుతో స్నేహం కొనసాగుతుంది. ఏ రోజు షన్ను నన్ను కంట్రోల్ చేయలేదు. అయితే, కొన్ని సందర్భాలు ప్రేక్షకులకు అలా అనిపించే ఉంటాయి. అయితే, తనకు నచ్చనివాళ్లతో తన ఫ్రెండ్స్ ఉంటే షన్ను భరించలేడు. హౌస్‌లో జస్సీ, నేను ఉన్నప్పుడు అన్నీ పంచుకొనేవాడు. జస్సీ వెళ్లిపోయాక.. అన్ని ఎమోషన్స్ నా మీదే చూపించేవాడు. ఎవరైనా నన్ను అడ్వాంటేజ్ తీసుకుని గేమ్ ఆడుతుంటే చెప్పేవాడు. (షన్నుకు నుదుటి మీద ముద్దు పెట్టడం గురించి చెబుతూ..) ఆ రోజు అతడు తన కష్టాల గురించి చెప్పుకుని బాధపడ్డాడు. ఈ సందర్భంగా అతడికి ధైర్యం చెబుతూ నుదుటి మీద ముద్దు పెట్టాను. అది కేవలం నా ఎమోషన్.. వేరే ఉద్దేశం లేదు. చోటు (బాయ్‌ఫ్రెండ్) నా లైఫ్.. అతడికే నా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రోజు.. చోటు స్టేజ్ మీద వదిలేస్తున్నావా అని సరదాగా డైలాగ్ వేశాడు. నేను తనని వదలనని అతడికి కూడా తెలుసు. సరయు గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్‌లో ఆమె కొన్ని స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. మేమిద్దరం ముందే మాట్లాడుకుని వచ్చామని ఆమె అంది. షన్ను, నేను బయట ఫ్రెండ్సే కాదు. ఆమె ఎందుకు అలా అన్నదో అర్థం కాలేదు.. అని సిరి అంది.
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?
Animal Telugu Teaser: ‘యానిమల్’ టీజర్: నాకన్నా చెడ్డవాడు లేడు - రణ్ బీర్ ఊరమాస్ అవతార్ అదుర్స్!
Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?
Gruhalakshmi September 28th: ఒక్కటైన దివ్య, విక్రమ్- తులసి సేవలో నందు, హనీపై రత్నప్రభ పైశాచికత్వం!
ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్ రెడ్డి
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
World University Rankings 2024: వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు
/body>