Mango Ram - Sunitha: సింగర్ సునీత భర్త, మ్యాంగో ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కుల సంఘాల దాడి
ప్రముఖ గాయని సునీత భర్త, మ్యాంగో యూట్యూబ్ ఛానల్ అధినేత రామ్ ఆఫీసుపై గౌడ కులస్థులు దాడి చేసినట్టు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే...
ప్రముఖ గాయని సునీత భర్త, మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ వీరపనేని చిక్కుల్లో పడ్డారు. సునీతను వివాహం చేసుకోవడానికి ముందు నుంచి సినిమా సర్కిల్స్‌లో ఆయన పాపులర్. ఆయనకు ఓ మ్యూజిక్ కంపెనీ ఉంది. అందులో సినిమా పాటలను విడుదల చేస్తుంటారు. అలాగే, స్పెషల్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేయిస్తూ ఉంటారు. రామ్ వీరపనేని కొన్ని సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. డిజిటల్ రంగంలో ఆయనది పేరున్న కంపెనీ.
సినిమాల్లో వార్తల్లో నిలిచే రామ్ వీరపనేని, ఈసారి ఓ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఆయన సంస్థ కార్యాలయంపై గౌడ కుల సంఘాలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య రామ్ వీరపనేనికి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేశారు. అందులో గౌడ వర్గానికి చెందిన మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంత మంది దాడి చేసినట్టు సమాచారం. దాడికి ముందు రామ్ వీరపనేనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... శ్రీనగర్ కాలనీలోని ఆయన సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేశారట. మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నుంచి తక్షణమే ఆ వీడియోస్ డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేశారు. రామ్, మ్యాంగో ఛానల్ మీద కేసు పెట్టినట్టు సమాచారం. దీనికి రామ్ వీరపనేని గానీ, ఆయన సంస్థకు సంబంధించిన వ్యక్తులు గానీ స్పందించలేదు.
రామ్, సునీత వివాహం తర్వాత వారిద్దరి పెళ్లి, జీవితానికి సంబంధించిన విషయాలు ఎక్కువ వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు వివాదం వచ్చింది. ఇది ఎలా సద్దుమణుగుతుందో చూడాలి. కళాకారులు సినిమాలు, పాటలు, షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా పని చేసేటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవడం ఇప్పుడు ముఖ్యమైంది. లేదంటే ఇటువంటి గొడవలు తప్పడం లేదు.
Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?
Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
Also Read: జనవరి 25 ఎపిసోడ్: ఎందుకు ఇలా చేశారని అంటూ భర్త కార్తీక్ కాలర్ పట్టుకుని కన్నీళ్లతో ప్రశ్నించిన వంటలక్క అలియాస్ దీప... కార్తీక దీపం మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే... పూర్తి వివరాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.