News
News
వీడియోలు ఆటలు
X

Bollywood Expensive Weddings: బాలీవుడ్‌లో ఖరీదైన పెళ్లిళ్లు - వీరి పెళ్లికి ఎన్నేసి కోట్లు కుమ్మరించారో తెలుసా?

పెళ్లంటే ఆకాశమంత పందిరి వేయడమే కాదు.. తరతరాలు చెప్పుకొనేంత ఘనంగా జరుపుకోవాలనేది నేటి ట్రెండ్. దీన్ని బాలీవుడ్ తారలు నిజం చేసి చూపిస్తున్నారు. కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ పెళ్లిళ్లు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఖర్చంటే కోట్ల రూపాయల్లోనే.. కళ్లు చెదిరిపోయే డెకరేషన్లు..కాస్ట్లీ వెడ్డింగ్ డెస్టినేషన్లు.. రాజమహల్స్ ను తలపించే వివాహ వేదికలు.. ఓ రేంజ్ లో ఉంటోంది హడావిడి. మరి బాలీవుడ్ లో రీసెంట్ ఇయర్స్ లో జరిగిన కాస్టీ పెళ్లిళ్లు వాటికి పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా.

1. సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా

షేర్షా జంట సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా అద్వానీకి పెళ్లికి భారీగా ఖర్చుపెట్టారు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో సూర్యఘర్ ప్యాలెస్ లో ఈ కొత్త జంట పెళ్లి జరిగింది. రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఏకంగా ఆరు కోట్ల రూపాయల ఖర్చు కేవలం పెళ్లికి, డెకరేషన్స్‌కు పెట్టింది ఈ జంట. చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే సన్నిహితులు, బంధువులు పెళ్లికి హాజరయ్యారు. ఈనెల 12న ముంబైలో బాలీవుడ్ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. మరి దానికి ఇంకెంత ఖర్చు పెడతారో చూడాలి.

2. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్

బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా రాజస్థాన్‌లోనే పెళ్లి చేసుకున్నారు. తమ స్పెషల్ డేను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేశారు. సవాయ్ మాధోపుర్ లోని ఫోర్ట్ బర్వారాలో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ జంట. 

3. ఆలియా భట్, రణబీర్ కపూర్

బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ బాంద్రాలోని తమ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లికి అయిన ఖర్చు అక్షరాలా 10 కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా ఆలియా ఫ్యామిలీ.. రెండున్నర కోట్లు విలువ చేసే వాచ్‌ను రణ్ బీర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు.  

4. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్

దీపికా పదుకొనే అండ్ రణ్ వీర్ సింగ్ ఇటలీలోని లేక్ కోమోలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అక్కడ కాస్ట్లీ విల్లాగా చెప్పుకునే డెల్ బాల్ బియానెల్లో గెస్ట్స్ కి వసతి కల్పించారు దీపికా అండ్ రణ్ వీర్. అందులో ఒక రూమ్ అద్దె రోజుకు 33 వేల రూపాయలు. అలాంటిది విల్లా మొత్తం వారం రోజులకు రెంట్ కి తీసుకున్నారు. దానికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా ఫుడ్, క్లాత్స్, డెకరేషన్స్ మొత్తం కలిపి 77 కోట్ల రూపాయలను తమ పెళ్లికి ఖర్చు పెట్టారు దీపికా అండ్ రణ్ వీర్. 

5. అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ 

ఈ లీగ్ లో కాస్ట్లీయెస్ట్ మ్యారేజ్ అంటే కొహ్లీ, అనుష్కలదే. కొహ్లీ క్రికెట్ లో సూపర్ స్టార్... అనుష్క బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. మరి వీళ్ల పెళ్లంటే ఏ రేంజ్‌లో ఉండాలి. అందుకే.. వీరు ఇండియా వదిలి ఇటలీలోని బోర్గో ఫినోషియోటోలో పెళ్లి చేసుకున్నారు. త్రీ నైట్ ఉండాలంటే అక్కడ 22 లక్షల రూపాయల రెంట్. ఇంతకీ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా పెళ్లికి అక్షరాలా 100 కోట్ల రూపాయలు.

Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్! 

Published at : 09 Feb 2023 11:50 AM (IST) Tags: Bollywood Expensive Weddings Kiara Sidharth Wedding Cost Kiara Wedding Cost

సంబంధిత కథనాలు

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Guppedanta Manasu June 7th: వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!

Guppedanta Manasu June 7th:  వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్