Trolling: నీ డ్రెస్సేంటి? డబ్బుల కోసం ఏమైనా చేస్తావా? యువనటిపై దారుణంగా ట్రోలింగ్
ఓ బాలీవుడ్ యువనటిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమె డ్రెస్ చూసి అసహ్యించుకునే ఎమోజీలు పెడుతున్నారు.
శ్వేత తివారి... బాలీవుడ్ జనాలకు పరిచయం లేని పేరు. ఒకప్పుడు బుల్లితెరపై తిరుగులేని హీరోయిన్. హిందీ బిగ్‌బాస్ విన్నర్‌గా కూడా నిలిచింది. 41 ఏళ్ల వయసులో కూడా చాలా అందగత్తె ఆమె. శ్వేతకు టీనేజీ వయసు దాటిన కూతురు ఉంది. పేరు పలక్ తివారీ. ఆమెకు హీరోయిన్ అవ్వాలని కోరిక. ఆ కోరికకు తల్లి సహాయం తోడవ్వడంతో ‘రోసీ: ది సాఫ్రీన్ చాప్టర్’ అనే సినిమా చేసింది. త్వరలో ఆ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తల్లితో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటోంది పలక్.
తల్లి శ్వేతతో కలిసి సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొంది పలక్. అందులో ఓ పాటకు తల్లీ కూతుళ్లిద్దరూ డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ఇన్ స్టాలో వైరల్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, పలక్ డ్రెస్ మాత్రం విపరీతమైన విమర్శలకు కారణమైంది. చాలా డీప్ నెక్ డ్రెస్ అది. నలుపు రంగులో ఉన్న ఆ డ్రెస్ లో పలక్ వక్షోజ భాగం చాలా వరకు కనిపిస్తోంది. అదే డ్రెస్సుతో ఆమె డ్యాన్సు కూడా వేయడంతో మరింతగా ఎలివేట్ అయ్యింది. వేసుకున్న లోదుస్తులు కూడా కనిపిస్తుండడంతో దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. శ్వేత తివారి మాత్రం పద్ధతైన డ్రెస్సింగ్లోనే కార్యక్రమానికి హాజరైంది.
View this post on Instagram
ఛీఛీ.. సిగ్గుందా?
పలక్ డ్రెస్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఆ డ్రెస్ వేసుకోవడానికి సిగ్గు లేదా’అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ‘తల్లిగా నీ కూతురికి కాస్త డ్రెస్సింగ్ సెన్స్ నేర్పించు’ అని హితవులు చెప్పారు. మరొకరైతే ఏకంగా ‘డబ్బుల కోసం ఏమైనా చేసే రకాలు’ అంటూ నీచంగా మాట్లాడారు. పలక్ ఈ కామెంట్లకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆమె సినిమా మాత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది.
View this post on Instagram
Read Also: అందమా అందమా.. టైటిల్ అందకుంటే న్యాయమా.. భారత్ నుంచి మిస్ వరల్డ్ విజేతలు వీరే..
Read Also: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్
Read Also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read Also: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం
Read Also: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!