News
News
X

Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్

రెజినా, నివేదా థామస్‌లు అదిరిపోయే కొరియన్ థ్రిల్లర్‌, కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంగళవారం రిలీజ్ డేట్ ప్రకటించారు.

FOLLOW US: 

అందాల భామలు నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా శాకిని-డాకిని. ఇది కొరియన్ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్నా.. రిలీజ్‌కు మాత్రం నోచుకోవడం లేదు. ఎట్టకేలకు చిత్రయూనిట్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న జనాల ముందుకు రానుంది. ఈ చిత్రం తొలుత ఓటీటీలో విడుదల అవుతున్నట్లు ప్రకటనలు వచ్చాయి. అయితే, నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఇద్దరు ముద్దుగుమ్మలు కీరోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్ సినిమాకు రీమేక్. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కొరియన్ సినిమాలో ఇద్దరు యువకులు ప్రధాన పాత్రలు పోషించారు. అదే సినిమాను తెలుగులోకి వచ్చేసరికి ఇద్దరు అమ్మాయిలతో ప్లాన్ చేశాడు దర్శకుడు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కించారు. ఈ సందర్భంగా కథలో చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు విడుదలకానున్నాయి.  
 
ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇద్దరు అమ్మాయిలు ట్రైనీ పోలీస్ ఆఫీసర్లు. అనుకోని పరిస్థితుల్లో అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే రౌడీ మూకల బారిన పడతారు. మానవ అక్రమ రవాణా నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు తమను తాము కాపాడుకుంటూనే.. మిగతా వారిని ఎలా రక్షించారు అనేదే సినిమా కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టర్లను దర్శకుడు వైవిధ్యభరితంగా రూపొందించినట్లు తెలుస్తోంది. 

సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగే ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి కలిసి నిర్మిస్తున్నారు. ఓ బేబి సినిమా తర్వాత వీరిద్దరి నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. తొలుత ఈ సినిమా విడుదలపై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు  చెప్పారు. ప్రస్తుతం జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం కంటే ఓటీటీల్లోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, చివరకు ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థలు సిద్ధం కావడం విశేషం.
 
అటు తన తాజా మూవీ వకీల్ సాబ్‌ తో నివేదా థామస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. మెస్మరైజింగ్ యాక్టింగ్ తో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. శాకిని-డాకిని సినిమాతో మరోసారి జనాలను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం నివేద థామస్ తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. అటు రెజీనా మాత్రం శాకిని-డాకిని మీదే ఆశలు పెట్టుకుంది. 

View this post on Instagram
 
A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Published at : 16 Aug 2022 05:57 PM (IST) Tags: Regina Cassandra Nivetha Thomas Shakini Dhakini

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Rashmika: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో రిలేషన్ - రష్మిక మాటలు విన్నారా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

Dasara Holidays: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు