Dunki Movie OTT: ‘డుంకీ’ ఓటీటీ రైట్స్ ఆ సంస్థకే - రిలీజ్‌కు ముందే లీక్
Dunki Movie OTT: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డుంకీ’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను జియో సినిమా దక్కించుకుంది.
Dunki Movie OTT: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు 2023 బాగా కలిసి వచ్చింది. సరైన హిట్ లేక చాలా కాలం ఇబ్బంది పడిన ఆయనకు ‘పఠాన్’ ఓ రేంజిలో బూస్టింగ్ ఇచ్చింది. జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన ‘పఠాన్’ మూవీ ఈ ఏడాది జనవరి 25న విడుదల అయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకుపైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో షారుఖ్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ‘జవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది.
‘డుంకీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న షారుఖ్
తాజాగా షారుఖ్ నటించిన చిత్రం ‘డుంకీ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమాని కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయినప్పటికీ 'జవాన్', 'పఠాన్', తర్వాత వస్తున్న ‘డుంకీ’పై భారీ అంచనాలను కలిగి ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, సతీష్ షా, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘డుంకీ’ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్
తాజాగా బాలీవుడ్ బజ్ ప్రకారం ‘డుంకీ’ సినిమా OTT పార్టనర్‌ను ఫిక్స్ చేసుకుంది. జియో సినిమాలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్ ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్‌ని ఆవిష్కరించారు. ఇందులో రానున్న సినిమాల లిస్ట్ లో ‘డుంకీ’ కూడా ఉంది. అయితే, ఎప్పటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుంది అనే అంశంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ బాలీవుడ్ బిగ్గీని జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
View this post on Instagram
Read Also: అదిరిపోయే ధరకు 'సలార్' ఓటీటీ రైట్స్ - ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు?