అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Salaar OTT : అదిరిపోయే ధరకు 'సలార్' ఓటీటీ రైట్స్ - ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు?

ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ ఓటీటీ రైట్స్ కళ్ళు చెదిరే మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'సలార్' ఓటీటీ రైట్స్ ని రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ప్రభాస్ నటిస్తున్న'సలార్'(Salaar) కూడా ఒకటి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోయే ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్నవార్త వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా ‘సలార్’ ఓటీటీ రైట్స్ కళ్ళు చెదిరే మొత్తానికి అమ్ముడయినట్లు సమాచారం. ఇప్పటివరకు మరే అగ్ర హీరో సినిమాకి లేనంత అతి పెద్ద ఓటీటీ డీల్ 'సలార్' మూవీకి జరగడం విశేషం. ఇంతకీ 'సలార్' ఓటీటీ రైట్స్ ని ఏ సంస్థ దక్కించుకుంది? ఎంత ఖర్చు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్'(Salaar) మూవీ పై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. చాలాకాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ కారణంగా సినిమాకి భారీ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా సలార్ ఓటీటీ రైట్స్ కళ్ళు చెదిరే మొత్తానికి అమ్ముడైనట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా. కానీ ఆ భారీ మొత్తం ఎంత అనేది బయటికి రాలేదు. తాజాగా ఆ మొత్తం రూ.160 కోట్లు అని తేలింది.

సలార్ ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. 'సలార్' సినిమాని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్‌తో కొద్ది రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ఈ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలన్నింటిలో ఇదే అత్యధికం కావడం విశేషం. 'బాహుబలి' తర్వాత హ్యాట్రిక్ ప్లాప్స్ ఉన్న ప్రభాస్ సినిమాకి ఇంత మొత్తం ఖర్చు చేశారంటే ప్రభాస్ క్రేజ్‌కు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఈ భారీ ప్లాప్స్ తర్వాత వస్తున్న చిత్రమే 'సలార్'.

ఈసారి కచ్చితంగా ప్రభాస్ భారీ కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందుకు తగ్గట్లే ఈ సినిమా ఉంటుందని టీజర్ తోనే హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోంది. నిజానికి సెప్టెంబర్ 28నే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో డిసెంబర్ 22న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దానికంటే ఒక్కరోజు ముందు షారుక్ ఖాన్ నటిస్తున్న 'డంకీ' (Dunki) మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది.

ఈ ఏడాది 'పఠాన్', 'జవాన్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లు కొల్లగొట్టిన షారుక్ 'డంకీ'తో దాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'డంకీ', 'సలార్' మధ్య పోటీ ఉంటే కచ్చితంగా అది కలెక్షన్స్ పై ప్రభావం చూపుతోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది వాయిదా వేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

Also Read : 'నాన్న నువ్వు ఏడిస్తే మేము ఏడుస్తాం.. నువ్వు నవ్వితే అందరం నవ్వుతాం'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget