అన్వేషించండి

Jawan Release Postponed: షారుఖ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ‘జవాన్’ విడుదల వాయిదా, కారణం ఏంటంటే?

షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. యాక్షన్ సిక్వెన్స్ లో VFX వర్క్‌ పూర్తి చేయడానికి మరికాస్త సమయం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. చాలా కాలం తర్వాత ‘పఠాన్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్ ఖాన్, అదే జోష్ లో ‘జవాన్’తో మరో హిట్ అందుకోవాలని భావిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నారు.  ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరవనున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్, నయనతార, అట్లీ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.   

జవాన్’ విడుదల వాయిదాకు కారణం ఏంటంటే?

షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.  ఇప్పటికే ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా రిలీజ్ సుమారు రెండు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దానికి కారణం ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి VFX వర్క్‌  పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా తప్పని సరి అయ్యిందట. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే అంశంపై క్లారిటీ రాలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఆగష్టులో ఈ సినిమా విడుదల ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.  

జవాన్సినిమా వీడియో క్లిప్స్ లీక్

రీసెంట్ గా ‘జవాన్’ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. వీటిలో ఒక వీడియోలో షారూఖ్ ఖాన్ ఫైట్ సీన్లు చేస్తున్నట్లు ఉండగా, మరో వీడియోలో నయనతారతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై షారుఖ్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.  ‘జవాన్’ మూవీకి సంబంధించి కంటెంట్ ను వెబ్‌సైట్‌లు, కేబుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లు, డైరెక్ట్ టు హోమ్ సర్వీస్‌లతో సహా ఎలాంటి స్ట్రీమిండ్ ప్లాట్‌ఫారమ్‌ లు ప్రసారం చేయకూడదని ఆదేశించింది.  అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన  వైరల్ వీడియో క్లిప్‌లను తొలగించాలని యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్,  రెడ్డిట్ సహా పలు  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోర్టు ఆదేశించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

Read Also: కర్నాటకలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం, ప్రాణ స్నేహితుడి గెలుపు కోసం కష్టపడుతున్న కామెడీ బ్రహ్మ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget