Shaakuntalam First Look: శకుంతలగా సమంత, ఫస్ట్ లుక్ వచ్చేసింది
తాజాగా 'శాకుంతలం' సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత దేవకన్యలా కనిపించింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చాలా బిజీగా ఉంటుంది. వరుస ప్రాజెక్ట్ లను ఒప్పుకుంటూ.. బిజీ షెడ్యూల్స్ తో గడుపుతోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క కాస్త గ్యాప్ దొరికినా ట్రిప్ లకు చెక్కేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చాలా వెకేషన్స్ కి వెళ్లింది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి రచ్చ చేసింది సమంత.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద' అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. కొన్ని రోజులుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత దేవకన్యలా కనిపించింది. అరణ్యం మధ్యలో జంతువులతో కలిసి కూర్చున్నట్లుగా కనిపించింది సమంత.
ఈ పోస్టర్ చూస్తుంటే.. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలో శ్రీదేవి గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీదేవి కూడా ఇలానే అరణ్యంలో జంతువులతో కూర్చొని కనిపిస్తుంది. ప్రస్తుతం శకుంతలగా సమంత లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా నటించగా.. అల్లు అర్జున్ కూతురు అర్హ చిన్నప్పటి శకుంతలగా కనిపించనుంది.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. 'యశోద'తో పాటు పాటు ఓ బైలింగ్యువల్ సినిమా, అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లలో నటించనుంది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
View this post on Instagram