అన్వేషించండి
Advertisement
Sowcar Janaki: 'ఆస్తులన్నీ పోగొట్టాడు, ఒక్క పూటే భోజనం చేసేదాన్ని' - షావుకారు జానకి ఎమోషనల్ కామెంట్స్
రీసెంట్ గా షావుకారు జానకి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
1950లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నారు జానకి. 'షావుకారు' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత తల్లి, వదిన పాత్రల్లో కనిపించి మెప్పించారు. కొన్నాళ్లక్రితం వరకు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారామె. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
రీసెంట్ గా ఈమె ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగు పరిశ్రమ తనకు గుర్తింపు ఇవ్వలేదని.. తనను పక్కన పెట్టేశారని ఆమె బాధపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆమె.. తనకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు.
ఇదే సమయంలో తన భర్త, విడాకుల గురించి మాట్లాడారు. తాను సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని తన భర్త నాశనం చేశాడని చెప్పారు. తను కష్టపడి సంపాదిస్తుంటే.. తన భర్త మాత్రం ఆ డబ్బుని తాగుడు, వ్యసనాల కోసం ఖర్చు పెట్టేవాడని.. కొన్నాళ్లకు మొత్తం ఆస్తులన్నీ కరిగిపోయానని తెలిపింది. పిల్లల పేరు మీద కొన్న ఆస్తులు కూడా పోయాయని.. ఎంతో నమ్మక ద్రోహానికి గురయ్యానని ఎమోషనల్ అయ్యారు.
ఇప్పుడు ఆ ఆస్తులన్నీ ఉంటే వందల కోట్లు ఉండేవని చెప్పారు. తన భర్తతో కలిసి ఉంటే పిల్లలను పెంచే పరిస్థితి కూడా ఉండదేమోనని భయపడి విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. సినిమాలు చేస్తూ చాలా కష్టపడ్డానని.. వచ్చిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే.. తన భర్త మాత్రం తాగుడు కోసం ఒక్కో ఆస్తిని అమ్ముతూ వచ్చాడని.. తన గురించి, పిల్లల గురించి కూడా ఆలోచించలేదని ఎమోషనల్ అయ్యారు. అంత కష్టపడుతూ కూడా ఒక్క పూట మాత్రమే భోజనం చేసిన రోజులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సినిమా ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఆమెకి పద్మశ్రీ అవార్డ్ ప్రకటించింది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement