అన్వేషించండి
Sarkaru Vaari Paata Pre Release Event Date: 'సర్కారు వారి పాట' ప్రీరిలీజ్ ఈవెంట్ - ఎప్పుడు? ఎక్కడ?
'సర్కారు వారి పాట' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మే 7న నిర్వహించనున్నారు.

'సర్కారు వారి పాట' ప్రీరిలీజ్ ఈవెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు.
'కళావతి', 'పెన్నీ సాంగ్', టైటిల్ సాంగ్ అన్నీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. మే 2న విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఈ మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మే 7న నిర్వహించనున్నారు. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరగనుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా ఈవెంట్ అన్నీ కూడా పోలీస్ గ్రౌండ్స్ లోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మహేష్ సినిమాకి కూడా వెన్యూ అక్కడే ఫిక్స్ చేశారు.
ఇక ఈవెంట్ కి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వస్తారో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion