Samantha: సమంత ముంబైకి షిఫ్ట్ అయిందా?
సమంత ముంబైకి షిఫ్ట్ అయినట్లు సమాచారం.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం ఆమె చేతుల్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంతకు సంబంధించిన ఓ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ బ్యూటీ అన్ అఫీషియల్ గా ముంబైకి షిఫ్ట్ అయిపోయినట్లు సమాచారం. పెళ్లైనప్పటి నుంచి సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉండేది.
విడాకుల తరువాత చైతు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో సమంత సింగిల్ గా ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఓ హిందీ వెబ్ సిరీస్, సినిమాల్లో నటించబోతుంది. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేయబోతుంది సమంత. ఇప్పుడు ఆమె నటిస్తోన్న సినిమా షెడ్యూల్స్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా.. సామ్ ముంబై చెక్కేస్తోంది.
అక్కడే ఉంటూ రెస్ట్ తీసుకుంటుందో. అప్పుడప్పుడు హైదరాబాద్ కి వస్తూ.. తన వ్యాపారాలు చూసుకుంటుంది. ముంబైలో కూడా బిజినెస్ చేయాలనుకుంటుంది ఈ బ్యూటీ. త్వరలోనే అక్కడే తన బట్టల ఫ్రాంచైజీను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సమంత 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. మరోపక్క సమంత నటించిన 'యశోద' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
View this post on Instagram