అన్వేషించండి

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన ‘ఎస్కేప్ లైవ్’ ఎలా ఉంది?

వెబ్ సిరీస్ రివ్యూ: ఎస్కేప్ లైవ్
మొత్తం ఎపిసోడ్లు: 9 (7 మాత్రమే స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. మే 27 ఫైనల్ ఎపిసోడ్స్ ప్రసారం)
రేటింగ్: 3/5
నటీనటులు: సిద్దార్థ్, జావేద్ జాఫేరి, వాలుస్చా డి సౌజా, ప్లాబితా బోర్తకూర్, సుమేద్ ముద్గల్కర్, రిత్విక్ సాహోర్, రోహిత్ చందేల్, ఆద్యా శర్మ, స్వస్తికా ముఖర్జీ, స్వేత త్రిపాఠి తదితరులు 
దర్శకత్వం: సిద్దార్థ్ తివారీ
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
స్ట్రీమింగ్ డేట్: మే 20 & మే 27 (2 ఎపిసోడ్స్)
 
సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల సినిమాలు కాస్త తగ్గినా.. వెబ్ సీరిస్‌తో తన టాలెంట్‌ను చూపించుకొనేందుకు మరో అవకాశం వచ్చింది. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో విడుదలైన ‘ఎస్కేప్ లైవ్’ వెబ్ సీరిస్‌తో సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ వెబ్ సీరిస్.. ఇప్పుడున్న పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నాయి. మొన్నటి వరకు ‘టిక్ టాక్’, ‘డబ్ స్మాష్’ అంటూ టైంపాస్ చేసిన యువత.. ఇప్పుడు ‘షార్ట్స్’, ‘రీల్స్’, ‘చింగారీ’, ‘టాకా టక్’ అంటూ రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి ద్వారా కొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటే.. మరికొందరు ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనే తాపత్రయంతో దారుణమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వైరల్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటి పాత్రలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన వెబ్ సీరిసే ఈ ‘ఎస్కేప్ లైవ్’. మన చుట్టుపక్కల ఉండే జీవితాలనే కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని ఈ సీరిస్‌లో చూపించారు.

కథ: బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌ ఇంజినీర్ కృష్ణ(సిద్దార్థ్)కు తండ్రి లేకపోవడంతో తల్లి, చెల్లి బాధ్యతలను చూసుకోవల్సి వస్తుంది. దీంతో తన అర్హతకు తగిన ఉద్యోగం లభించకపోవడంతో ‘Escaype Live’ లైవ్ అనే షార్ట్ వీడియో యాప్‌లో మానిటర్‌గా చేరుతాడు. కృష్ణ సాంప్రదాయాలకు విలువ ఇచ్చే యువకుడు. అయితే, ‘ఎస్కేప్ లైవ్’లో వచ్చే అశ్లీల వీడియోలను బ్యాన్ చేయాలని చూస్తాడు. ఈ సందర్భంగా ఫేటిష్ గర్ల్ అనే యువతి పరిధి దాటుతుందనే కారణంతో ఆమె వీడియోను బ్యాన్ చేస్తాడు. అతడి బాస్(వాలుస్చా డి సౌజా) ఆదేశాల మేరకు అలాంటి వీడియోలపై చర్యలు తీసుకోలేడు. అంతర్లీనంగా మదనపడుతూ.. ఎలాగైనా ఆ యాప్‌లో అశ్లీలతకు అవకాశం లేకుండా చేయాలని అనుకుంటాడు. ఇందుకు అతడు ఏం చేశాడనేది బుల్లితెరపైనే చూడాలి. అయితే, ఇందులో కేవలం కృష్ణ పాత్ర ఒక భాగం మాత్రమే. కృష్ణతోపాటు మరో ఐదు పాత్రల కథలు సమాంతరంగా సాగుతాయి. ఆ కథలన్నీ ‘ఎస్కేప్ యాప్’పైనే ఆధారపడి ఉంటాయి. ఈ యాప్‌లో ఎన్ని డైమండ్ ఎమోజీలు వస్తే.. వారు అంత పాపులర్ అవుతారు. అందుకు హీనా(ప్లబితా బార్దాకర్) అనే వెయిట్రెస్ ఖాళీ సమయంలో ఫేటిష్ గర్ల్‌గా తన అందాలను యాప్‌లో ప్రదర్శిస్తుంది. డార్కీ(సుమేధ్ ముద్గాల్కర్) అనే సైకో యువకుడు ప్రాంక్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదిస్తాడు. టీవీలో డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొని పాపులర్ అవ్వాలని కలలగనే తల్లి తన కూతురు రాణి(ఆద్యా శర్మ)ని తన తమ్ముడికి అప్పగిస్తుంది. దీంతో అతడు డ్యాన్స్ రాణిగా ఆమెకు ఎస్కేప్ యాప్‌లో పాపులారిటీ వచ్చేలా చేస్తాడు. ఆమె యువతిలా కనిపించేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా హార్మోన్ ఇంజక్షన్లు కూడా చేయిస్తాడు. ఓ సూపర్ మార్కెట్లో పనిచేసే యువకుడు(రిత్విక్ షోరే) డార్కీకి అభిమాని. అతడిలా పాపులర్ అయ్యేందుకు ఆమ్చా స్సైడర్ పేరుతో ఒళ్లుగగూర్పాటు కలిగించే వీడియోలను చేస్తూ అభిమానులను సంపాదించుకొనే ప్రయత్నం చేస్తాడు. బ్యాంక్‌ ఉద్యోగం చేసే రాజ్ కుమార్‌(రోహిత్ చందేల్)కు సీక్రెట్‌గా మరో జీవితాన్ని గడుపుతాడు. అతడిలోని టాలెంట్ చూపించేందుకు మీనా పేరుతో అమ్మాయి వేషంలో వీడియోలు చేస్తుంటాడు. ఇతడికి సాయం చేసే యువతి పాత్రలో స్వేత త్రిపాఠి కనిపించింది. ‘ఎస్కేప్ లైవ్’ యాప్.. ఎక్కువ డైమండ్స్ సాధించేవారికి రూ.3 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వీరి జీవితాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతాయి. ఆ రూ.3 కోట్లు సాధించేందుకు వారు ఎంతకు తెగిస్తారు? ఎలాంటి పనులు చేస్తారు? కృష్ణ ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాడు? గెలుపు అంచుల వరకు చేరిన వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? చివరికి గెలిచేది ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: దర్శకుడు సిద్దార్థ్ తివారీ ఈ సబ్జెట్‌ను ఎంచుకోవడం సాహసమే. అయితే, దాన్ని ప్రేక్షకులను మెప్పించగలిగేలా తీయడం మరో సవాల్. అయితే, ఈ విషయంలో తివారీ కొంతవరకు విజయం సాధించడనే చెప్పుకోవాలి. కానీ, కథలో వేగం కరువైంది. కొన్ని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. దీంతో ఈ సీరిస్‌ను చూసేందుకు ఎంతో ఓపిక తెచ్చుకోవాలి. 5 ప్రధాన పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి చూపించాల్సి రావడం వల్ల మనకు లాగ్ అనిపిస్తుంది. అయితే, ఇలాంటి కథల్లో అలాంటి తడబాట్లు సాధారణమే. అలాగే, సిద్దార్థ్ క్యారెక్టర్‌ను మరింత బాగా మలుచుకోవల్సింది అనిపిస్తుంది. అమాయకమైన చెల్లి ఎవరితోనే మాట్లాడుతుందనే కారణంతో.. ఆ వ్యక్తిని సిద్ధార్థ్ అరెస్టు చేయించడం, ఆమెను కొట్టడం వంటి సీన్స్ జీర్ణించుకోవడం కష్టమే. విలువలకు అంత ప్రాధాన్యమిచ్చే సిద్దార్థ్ ఫేటిష్ గర్ల్ విషయంలో మాత్రం తన క్యారెక్టర్ మార్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అయితే, ‘ఎస్కేప్ లైవ్’ మొత్తం 9 ఎపిసోడ్స్. వీటిలో ఏడు ఎపిసోడ్ మాత్రమే ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. మే 27 నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్స్ స్ట్రీమ్ కానున్నాయి. రూ.3 కోట్లు ఎవరు గెలుచుకుంటారనేది ఆ ఎపిసోడ్స్‌లోనే రివీల్ అవుతుంది. ఇందులో డ్యాన్సింగ్ రాణిగా నటించిన 11 ఏళ్ల చిన్నారి పెద్ద పిల్లగా మారేందుకు గ్రోత్ ఇంజెక్షన్లు చేయించుకుంటుంది. ఆమె డ్యాన్స్ సన్నివేశాలను చూడటం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఫేటిష్‌గర్ల్, తన బాస్(స్వస్తికా ముఖర్జీ) మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు పంటి కింద రాయిలా తగులుతాయి. ఇవన్నీ పక్కన బెడితే.. దర్శకుడు బయట ప్రపంచంలో జరుగుతున్న వాస్తవ ఘటనలను బుల్లితెరపై కళ్లకు కట్టినట్లు చూపించడాన్ని మెచ్చుకోవచ్చు. అయితే, దీనిపై మరింత లోతుగా అన్వేషిస్తే ‘సోషల్ మీడియా’కు సంబంధించి ఇంకా మంచి సబ్జెక్ట్స్ దొరికేవేమో. ఇక నటన విషయానికి వస్తే సిద్దార్థ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాడు. రాజ్‌కుమార్‌/మీనా కుమారి పాత్రల్లో రోహిత్ చందేల్ జీవించాడనే చెప్పాలి. అలాగే చిన్నారి ఆద్యా శర్మ పాత్రలో లీనమైపోయింది. చిన్న వయస్సులో పెద్ద తరహా పాత్ర చేయడమంటే మాటలు కాదు. కానీ, ఆద్యాను చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. డార్కీగా సుమేద్ భయపెడతాడు. మిగతా పాత్రలు కూడా మిమ్మల్ని మెప్పిస్తాయి. కానీ, ముందుగా చెప్పుకున్నట్లు ఈ సీరిస్‌ను చూడాలంటే మీకు ఓపిక ప్లస్ టైమ్ కూడా ఉండాలి.  

Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SS Rajamouli RRR Japan Visit | జపాన్ RRR స్పెషల్ షో లో రాజమౌళి సందడి | ABP DesamMohan Babu Birthday Celebrations | తండ్రి పుట్టినరోజు వేడుకల్లో భార్యతో కలిసి మంచు మనోజ్ | ABP DesamAP Volunteers YSRCP Campaign in Visakha | విశాఖపట్నంలో వాలంటీర్లతో వైసీపీ ఎన్నికల ప్రచారం |ABP DesamAR Rahman The Goat Life Interview | మళ్లీ Oscar తెచ్చేపనిలో AR Rahman | Prithviraj Sukumaran | ABP

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Seema Politics: ఈసారి సీమ టపాకాయ ఎవరు? పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ కసరత్తు, పూర్వవైభవం కోసం టీడీపీ ఎత్తులు
ఈసారి సీమ టపాకాయ ఎవరు? పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ కసరత్తు, పూర్వవైభవం కోసం టీడీపీ ఎత్తులు
Weather Latest Update: నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
Mynampally Vs Malla Reddy: మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు
మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు
Infosys Narayana Murthy: మనవడికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఖరీదైన గిఫ్ట్, విలువ ఎంతో తెలుసా!
మనవడికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఖరీదైన గిఫ్ట్, విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా!
Embed widget