అన్వేషించండి

Samantha: సమంత 'యశోద'కు భారీ బిజినెస్ డీల్స్!

సమంత 'యశోద'కు భారీ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద'(Yashoda) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు అవుతుంది.

ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లో సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసే పోరాటాన్ని చూపించారు. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 

సినిమాపై ఏర్పడిన బజ్ కి తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే డీల్స్ మొత్తం క్లోజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సినిమాస్ సంస్థ, దిల్ రాజు కలిసి రూ.10 కోట్లకు తీసుకున్నారు. కర్ణాటకలో సినిమాను హాట్ స్టార్ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. 'కార్తికేయ2' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసిన సంస్థ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది. 

అమెజాన్ ప్రతినిధులు సినిమా చూసి రూ.22 కోట్లకు అన్ని భాషలకు చెందిన డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ హక్కులు రెండు కోట్ల మేరకు బేరాలు సాగుతున్నాయి. శాటిలైట్ హక్కుల కోసం కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు నిర్మాత. సినిమా మేకింగ్ అండ్ రెమ్యునరేషన్స్ కలుపుకొని రూ.30 కోట్ల వరకు అయిందట. పబ్లిసిటీ, వడ్డీల కోసం మరో రూ.10 కోట్లు ఖర్చవుతుంది. అంటే మొత్తం రూ.40 కోట్లన్నమాట. దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతోంది. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న 'యశోద' సినిమాలో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాస్తున్నారు.  

హైలైట్ గా యాక్షన్ సీక్వెన్సెస్:
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయట. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లతోనే వర్క్ చేయించారు. క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 


Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget