Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?
సమంతకి ఎన్టీఆర్30 సినిమాలో ఛాన్స్ వచ్చిందట.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యశోద', 'ఖుషి' అనే సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో దర్శకుడు రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకుంటున్నారట.
అలానే తాప్సీ బ్యానర్ లో కూడా సమంత ఓ సినిమా చేయబోతుందని సమాచారం. ఇప్పుడు ఆమెకి మరో మంచి సినిమా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ తో మరోసారి నటించే ఛాన్స్ రావడం అదృష్టమనే చెప్పాలి. కానీ సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట.
Samantha In Worry With NTR's Project: ఇప్పటికే సమంత బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకేతో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయింది. దాన్ని పక్కన పెట్టడానికి లేదు. అలానే మరో హిందీ సినిమా కూడా కమిట్ అయింది. ఆ సినిమా కూడా కచ్చితంగా చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వచ్చింది. నిజానికి ఇది మంచి ఛాన్స్. చాలా కాలం తరువాత ఇలా ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడమంటే సమంత లక్ అనే చెప్పాలి.
దాన్ని ఎలా వర్కవుట్ చేయాలనే విషయంలో సమంత ఆలోచనలో పడింది. ఎన్టీఆర్ సినిమాలో నిర్మాణ భాగస్వామి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా పనులు పక్కన పెట్టారు. ఒక్కసారి ఆయన ఫ్రీ అయిపోతే.. ఎన్టీఆర్ 30 సినిమా పనులు షురూ అవుతాయి. ఈ సినిమాను వదులుకోవాలని సమంత అనుకోవడం లేదు. మరి తన బాలీవుడ్ కమిట్మెంట్స్ ను అడ్జస్ట్ చేసుకొని సినిమా చేస్తుందేమో చూడాలి!
Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!
Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే
View this post on Instagram