Bimbisara Box Office Collection : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!
Bimbisara Collection Day 3 : 'బింబిసార' ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అయ్యింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ఫెంటాస్టిక్ ఫిగర్స్ నమోదు చేసింది.
![Bimbisara Box Office Collection : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా! Bimbisara box office collection day 3: Nandamuri Kalyan Ram Catherine Tresa Samyuktha Menon's Bimbisara Movie earns Rs 18 crore Share On First Weekend Bimbisara Box Office Collection : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/4ee070ac5044e62473987da4c8e24c071659931349_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara Movie) బాక్సాఫీస్ బరిలో దూకుడు చూపించింది. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీ. అంతే కాదు... నిర్మాత హరికృష్ణ .కె, హీరోను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
Bimbisara First Weekend Collections In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ (సినిమా విడుదలైన మూడు రోజుల్లో) 'బింబిసార' 15.7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. థియేట్రికల్ రైట్స్ 13.5 కోట్లకు విక్రయించారు. ఆల్రెడీ అంత కంటే ఎక్కువ కలెక్ట్ చేయడంతో ఇకపై వచ్చేవి అన్నీ లాభాలే. పర్సంటేజ్ పరంగా చూస్తే... 100 శాతం కాదు, 120 శాతం వసూలు చేసినట్టు! కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా చూస్తే... భారీ హిట్ ఇది. బాక్సాఫీస్ బరిలో ఆయన భారీ హిట్ కొట్టారని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 5.66 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 2.26 కోట్లు
సీడెడ్ : రూ. 3.38 కోట్లు
నెల్లూరు : రూ. 50 లక్షలు
గుంటూరు : రూ. 1.27 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 88 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 1.02 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 73 లక్షలు
ఏపీ, తెలంగాణ... మొత్తం 15.70 కోట్ల రూపాయల షేర్ లభించింది. గ్రాస్ పరంగా చూస్తే... 24.1 కోట్ల రూపాయలు అని చెప్పాలి. నైజాంలో రూ. 9.40 కోట్లు, సీడెడ్ రూ. 9.8 కోట్లు, ఏపీలో 9.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సినిమా బాగా ఆడుతోంది.
అమెరికాలో కోటి గురూ!
అటు అమెరికాలోనూ బింబిసారుడు జోరు చూపిస్తున్నాడు. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా సినిమాను ఆదరిస్తున్నారు. అమెరికాలో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 'బింబిసార' కోటి రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో రూ. 1.08 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో సినిమా రూ. 18.10 కోట్లు కలెక్ట్ చేసింది.
'బింబిసార'లో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. అయితే... ఆయన క్రూరుడైన మహా చక్రవర్తిగా ఆయన చూపించిన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?
బింబిసారకు జోడీగా కేథరిన్ (Catherine Tresa) కనిపించారు. మరో కథానాయికగా ఎస్సై వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటించారు. వాళ్ళిద్దరి పాత్రల నిడివి తక్కువే. అయితే... రెండో భాగంలో వాళ్ళకు ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. వశిష్ఠ దర్శకత్వం వహించారు.
Also Read : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)