అన్వేషించండి

Telugu Movies This Week : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే

Upcoming Theatrical, OTT release Movies List : ఏకంగా పది తెలుగు సినిమాలు... ఇటు థియేటర్లు, అటు ఓటీటీ వేదికల్లో ఈ వారం విడుదలవుతున్నాయి. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ అని చెప్పాలి.

What To Watch This Weekend : Movies And Web Series (August 8th to August 14th) థియేటర్లలో మూడు సినిమాలు... ఓటీటీలో ఏడు సినిమాలు... అన్నీ తెలుగులో చూసే అవకాశం ఉంది. ఇటు థియేటర్లు... అటు ఓటీటీ వేదికల్లో ఈ వారం ఏకంగా పది తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి తోడు ఒక వెబ్ సిరీస్, ఇతర భాషల సినిమాలు కొన్ని ఉన్నాయి. శుక్ర, శని, ఆది వారాలకు తోడు సోమవారం నాడు ఆగస్టు 15 రావడంతో చాలా మందికి లాంగ్ వీకెండ్ వచ్చింది. సినిమాలు చూస్తూ టైమ్ స్పెండ్ చేయాలని... ఎంజాయ్ చేయాలనుకునే వారికి బోలెడు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి. ఇండిపెండెన్స్ డే వీకెండ్ వస్తున్న సినిమాలు ఏవో చూడండి.  

మెగాస్టార్ సమర్పణలో 'లాల్ సింగ్ చడ్డా' 
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) గురువారం థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ కథానాయికగా, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటించారు. హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ ఇది. మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్ విడుదల అవుతోంది. మెగాస్టార్ ఇంట్లో రాజమౌళి, నాగార్జున, చిరుకు ప్రత్యేకంగా సినిమా చూపించడమే కాదు... ఇటీవల తెలుగు సినిమా ప్రముఖులకు స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. తెలుగు మార్కెట్ మీద ఆమిర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడి ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.

నితిన్ మాస్ 'మాచర్ల నియోజకవర్గం'
'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఇదొక మాసీ ఫిల్మ్ అని, ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుందని నితిన్ చెబుతున్నారు. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటించారు. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ (ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ రోల్ చేశారు.

దేవుడు కాదు... డాక్టర్ 'కార్తికేయ 2'
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' (Karthikeya 2). ఆగస్టు 13... అనగా శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకృష్ణుని ద్వారకా నగరం వెనుక ఏదో రహస్యం ఉంది అని, దాన్ని ఛేదించే పనిలో హీరో ఉన్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'నీ ప్రాణం పణంగా పెట్టి జనాల ప్రాణం కాపాడటానికి నువ్వు ఏమైనా దేవుడివా?' అని అనుపమ ప్రశ్నిస్తే... 'కాదు డాక్టర్ ని' అని నిఖిల్ చెప్పడం... 'కృష్ణుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్ సముద్రం నుంచి అట్లాంటిక్ మహా సముద్రం వరకూ ముడిపడిన ఒక మహా చరిత్ర' అని ఆదిత్య మీనన్ చెప్పే డైలాగ్...  సినిమాపై ఆసక్తి పెంచాయి.

Telugu Movies Releasing In Theatres This Week : థియేటర్లలోకి ఈ వారం వస్తున్న మూడు మేజర్ సినిమాలు ఇవేనని చెప్పాలి. నితిన్, నిఖిల్ సినిమాలకు తోడు ఆమిర్ ఖాన్ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. థియేటర్స్ సంగతి పక్కన పెట్టి, ఓటీటీ వేదికల్లో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి? అనేది చూస్తే... 

'హలో వరల్డ్' వెబ్ సిరీస్ కూడా!వెబ్ సిరీస్ విషయానికి వస్తే... నిహారికా కొణిదెల నిర్మించిన 'హలో వరల్డ్' (Hello World Telugu Web Series) ఒక్కటే ఈ వారం మేజర్ రిలీజ్. ఇందులో ఆర్యన్ రాజేష్, సదా, మై విలేజ్ షో అనిల్, నిఖిల్ విజయేంద్ర సింహా, నిత్యా శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 12న 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.

Telugu Movies Releasing In OTT Platforms This Week: ఆగస్టు 11న హిందీ సినిమా 'రాష్ట్ర కవచ్', పంజాబీ సినిమా 'బ్యూటిఫుల్ బిల్లో', కన్నడ సినిమా 'విండో సీట్', ఆగస్టు 12న బెంగాలీ సినిమా 'శ్రీమతి' జీ 5 ఓటీటీలో విడుదల కానున్నాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే... 

అమలా పాల్ 'కడవర్' - డైరెక్ట్ డిజిటల్ రిలీజ్
అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వయంగా నిర్మించిన సినిమా 'కడవర్' (Cadaver Telugu Movie). ఇదొక ఫోరెన్సిక్ థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అవుతోంది. 

'నెట్‌ఫ్లిక్స్‌'లో 'హ్యాపీ బ‌ర్త్‌డే'
లావణ్యా త్రిపాఠీ ప్రధాన పాత్రలో... 'వెన్నెల' కిశోర్, 'స్వామి రారా' సత్య, నరేష్ అగస్త్య, 'గెటప్' శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన 'హ్యాపీ బర్త్ డే' సినిమా సోమవారం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయ్యింది.

'డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌'లో రామ్ 'వారియర్'
రామ్, కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్' సినిమా డిజిటల్ రిలీజ్ కూడా ఈ వారమే. ఆగస్టు 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. కమర్షియల్ కాప్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మాస్ ప్రేక్షకులను 'ది వారియర్' ఆకట్టుకుంది. 

'ప్రైమ్ వీడియో'లో 'థాంక్యూ'... 'సోనీ లివ్‌'లో 'గార్గి'
అక్కినేని నాగ చైతన్య 'థాంక్యూ', సాయి పల్లవి 'గార్గి' సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయి. ఆగస్టు 12న ఈ రెండు సినిమాలు డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'థాంక్యూ' వస్తుండగా... సోనీ లివ్ ఓటీటీలో 'గార్గి' తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. 

'ఆహా'లో డబుల్ ధమాకా... 'మహా మనిషి', 'మాలిక్'
'ఆహా'లో ఈ వారం రెండు డబ్బింగ్ సినిమాలు వీక్షకులు వినోదం అందించడానికి రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ సేతుపతి నటించిన 'మహా మనిషి' కాగా... మరొకటి ఫహాద్ ఫాజిల్ 'మాలిక్'. రెండూ ఆగస్టు 12నే విడుదల కానున్నాయి.

Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!

ఆగస్టు 12న 'మలయన్‌కుంజ్'
ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన మలయాళ సినిమా 'మలయన్‌కుంజ్' (Malayankunju). ఆగస్టు 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. జూలై 22న ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో 'డే షిఫ్ట్' యాక్షన్ ఫాంటసీ హారర్ సినిమా కూడా వస్తోంది. ఇవి కాకుండా కొన్ని వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.

Also Read : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Starlink Vs Russia: ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
ఎలాన్ మస్క్‌కు రష్యా గండం - స్టార్ లింక్ శాటిలైట్లపై పుతిన్ కన్ను - ఇక విధ్వంసమేనా?
Embed widget