News
News
X

Samantha Viral Post : కిందపడ్డాను కానీ అవుట్ కాలేదు - సమంత వైరల్ పోస్ట్

సమంత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఏ ఉద్దేశంతో చేశారు? ఆమెకు ఏమైంది? అనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది.

FOLLOW US: 

ఇప్పుడు సమంత (Samantha) ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇదొక ప్రశ్న కాదు... డిస్కషన్ పాయింట్!  ఎందుకంటే... ఆమె ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంత గతంలో చర్మ సంబంధిత సమస్యలతో సతమతం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య తిరగబెట్టిందని, చికిత్స కోసం ఆ మధ్య వార్తలు వస్తే... ఆమె మేనేజర్ ఖండించారు. ఆ సంగతి పక్కన పెడితే... సామ్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. 

కిందపడ్డాను కానీ...
సోషల్ మీడియాలో శుక్రవారం సమంత ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో ఆమె పెట్ డాగ్ ఉంది. సోఫాలో పిల్లో వెనుక తల పెట్టుకుంది ఉంది. ఆ ఫోటోకి 'డౌన్ నాట్ అవుట్' అని సమంత క్యాప్షన్ ఇచ్చారు. దానికి మీనింగ్... కిందపడ్డాను కానీ అవుట్ కాలేదని అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి సమంత ఎవరికి క్లారిటీ ఇచ్చారు? లేదంటే ఎవరిపై సెటైర్ వేశారు? అనేది టాపిక్ అవుతుంది. 

అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత సమంత కోయంబత్తూర్ వెళ్లారని, అక్కడ ఈషా ఫౌండేషన్‌లో మెడిటేషన్ చేస్తున్నారని ఒక కథనం. మరోవైపు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ చేసిన సినిమాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఆమె కెరీర్ కూడా వార్తల్లో నిలుస్తోంది. ఈ రెండిటికీ ఒక్క పోస్ట్ ద్వారా సమాధానం ఇచ్చారని అనుకోవాలి. 

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

News Reels

విడాకులకు ముందు సోషల్ మీడియాలో సమంత చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ప్రతి చిన్న విషయాన్నీ ఫాలోయర్లతో పంచుకోవడం ఆమె దినచర్యలో భాగంగా ఉండేది. అయితే... విడాకుల తర్వాత సోషల్ మీడియాకు దూరం ఉండటం స్టార్ట్ చేశారు. ట్రోల్స్, మీమ్స్ వంటి అంశాలకు దూరంగా ఉండాలనుకున్నారో? లేదంటే తన గురించి వీలైనంత తక్కువ ప్రజలకు తెలియడం మంచిదని అనుకున్నారో? ఏది ఏమైనా... డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చారు. ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 

త్రీడీ కోసం 'శాకుంతలం' వాయిదా!
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన దృశ్యకావ్యం 'శాకుంతలం'. తొలుత నవంబర్ 4న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... త్రీడీ వర్క్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉండటంతో సినిమాను వాయిదా వేశారు. ఇందులో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు.

'యశోద'లో గర్భవతిగా...
సమంత నటించిన మరో పాన్ ఇండియా సినిమా 'యశోద'. ఇందులో గర్భవతి రోల్ చేశారు. ఆ మధ్య విడుదల అయిన టీజర్ ఆకట్టుకుంది. డాక్టర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సమంతకు చెబుతారో... అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఆమెకు ఎదురవుతాయి. వాటి నుంచి ఎలా బయట పడిందనేది సినిమా. 

Also Read : Chiranjeevi - Godfather : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...

'శాకుంతలం', 'యశోద' కాకుండా విజయ్ దేవరకొండకు జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమాలోనూ సమంత నటిస్తున్నారు. అదీ పాన్ ఇండియా చిత్రమే. 

Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

Published at : 08 Oct 2022 02:29 PM (IST) Tags: samantha Shaakuntalam samantha insta post Yashoda Samantha Targets Trollers

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !