అన్వేషించండి

Chiranjeevi - Godfather : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో

హిందీలో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అక్కడ సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడు హిందీ వెర్షన్ స్క్రీన్ కౌంట్ పెరిగింది. 

'గాడ్ ఫాదర్' (Godfather) కు నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఉత్తరాది ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలుసు. 'ఆజ్ కా గూండారాజ్', 'ప్రతిబంద్' వంటి సినిమాలు చేశారు. 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేశారు. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' (Godfather Hindi Release) కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవికి తోడు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ (Salman Khan) అతిథి పాత్ర చేయడంతో అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. థియేటర్లకు జనాలు వస్తుండటంతో మరిన్ని స్క్రీన్లు యాడ్ చేస్తున్నారు. 

హిందీలో 600 స్క్రీన్లు పెరిగాయ్!
హిందీలో 'గాడ్ ఫాదర్'కు లభిస్తున్న ఆదరణ, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి తెలిపారు. నేటి నుంచి హిందీలో మరో 600 స్క్రీన్లు యాడ్ చేస్తున్నామని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. నిజంగా 'గాడ్ ఫాదర్'ను పాన్ ఇండియా సినిమా చేశారని చిరు మాట్లాడారు. 

హిందీలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు?
నార్త్ ఇండియన్ మార్కెట్‌లో 'గాడ్ ఫాదర్' పది కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే... అంత కంటే ఎక్కువ కలెక్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే... మొదటి రోజు సుమారు రెండున్నర కోట్లు, రెండో రోజు రెండు కోట్లు కలెక్ట్ చేసింది. నేటి నుంచి మరో 600 స్క్రీన్లు యాడ్ చేయడంతో హిందీలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

బాస్ ఈజ్ బ్యాక్ అంటున్న మెగా ఫ్యాన్స్!
విజయ దశమి సందర్భంగా విడుదలైన 'గాడ్ ఫాదర్'కు మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు గ్రాస్ రూ. 31 కోట్లు ఉందని తెలిసింది. మొత్తం మీద రెండు రోజుల్లో 69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు సినిమా రెస్పాన్స్ బావున్నట్లు తెలుస్తోంది. శని, ఆది వారాలు సెలవులు వసూళ్లు నిలకడగా ఉండే అవకాశం ఉంది.   

హిందీలో గత వారం హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన 'విక్రమ్ వేద' విడుదల కావడంతో 'గాడ్ ఫాదర్'కు ఎక్కువ థియేటర్లు లభించలేదు. ఇప్పుడు ఆ సినిమాను చాలా మంది చూశారు. ఈ వారం అమితాబ్ బచ్చన్, రష్మిక నటించిన 'గుడ్ బై' విడుదలైంది. దీనికి గొప్ప స్పందన రాలేదు. దాంతో చాలా థియేటర్లలో 'గాడ్ ఫాదర్' షోస్ వేస్తున్నారట.  

Also Read : GoodBye Movie Review 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా ఎలా ఉందంటే?

మోహన్ లాల్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్'. మలయాళ సినిమాతో పోలిస్తే... తెలుగులో చాలా మార్పులు చేశారు. అందులో తమ్ముడి క్యారెక్టర్ కట్ చేయడం ఒకటి. విలన్ క్యారెక్టర్ సీఎం కుర్చీ మీద మోజు పడటం మరొకటి. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మాసీగా మార్చారు. మోహన్ రాజా చేసిన మార్పులకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మెగాస్టార్ నుంచి మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో... ఆయా అంశాలతో కొత్తగా సినిమా తీశారని దర్శకుడిని చాలా మంది మెచ్చుకుంటున్నారు.

Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget