News
News
X

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

మొదటి నుంచి కూడా 'సలార్' షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి.

FOLLOW US: 
 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్‏టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 

ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మరణించారు. దీంతో ప్రభాస్.. కొంతకాలంపాటు ఆయన షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితి లేదనుకున్నారు. షూటింగ్ వాయిదా పడుతుందని అందరూ భావించారు. కానీ నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం మొత్తం 12 సెట్లు వేశారు. ప్రతీ సెట్ లోనూ రెండు, మూడు రోజులు మాత్రం షూటింగ్ చేస్తారట. కానీ సెట్ లు వేయక తప్పలేదు. ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మొదటి నుంచి కూడా 'సలార్' షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సీరియస్ అవుతున్నారట. ఇలా షూటింగ్ సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకొస్తే జనాల్లో ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుందని.. ఫస్ట్ లుక్, టీజర్స్ వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ పడుతుందేమోనని భయపడుతున్నారు. 

నో మొబైల్ ఫోన్ రూల్:

News Reels

జనాల్లో ఎగ్జైట్మెంట్ అలానే ఉంచాలని.. ఇకపై ఫొటోలు, వీడియోలు లీక్ అవ్వకుండా కొన్ని రూల్స్ పెట్టారు ప్రశాంత్ నీల్. షూటింగ్ లో పాల్గొనే ఎవరి దగ్గర కూడా ఫోన్ ఉండడానికి వీల్లేదని చెప్పారట. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ, వారి అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా రూమ్స్ లో, క్యారవాన్స్ లో మొబైల్ ఫోన్స్ ను పెట్టిన తరువాత షూటింగ్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారట. ఇదివరకు రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 

ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరిన్ని సినిమాలు ఒప్పుకున్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు. మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్ట్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.    

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Published at : 26 Sep 2022 04:09 PM (IST) Tags: prashanth neel Salaar Prabhas Salaar Leaks

సంబంధిత కథనాలు

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

New Year gift to farmers: పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు- ఆరోజునే ఇస్తారట!

New Year gift to farmers: పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు- ఆరోజునే ఇస్తారట!