Ram Charan: రామ్ చరణ్ తో 'సాహో' డైరెక్టర్ రీమేక్ ప్లాన్?
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'తేరి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సుజీత్.
'రన్ రాజా రన్' లాంటి సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు సుజీత్. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా సుజీత్ కి మంచి పేరొచ్చింది. దీంతో అతడితో సినిమాలు చేయడానికి అగ్ర నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపించాయి. యువి క్రియేషన్స్ లో ప్రభాస్ తో సినిమా సెట్ అయింది. అయితే ప్రభాస్ 'బాహుబలి'తో బిజీగా ఉండడంతో సుజీత్ కి ఎదురుచూపులు తప్పలేదు. ఫైనల్ గా వీరిద్దరి కాంబినేషన్ లో 'సాహో' అనే సినిమా వచ్చింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో సుజీత్ కి ఇండస్ట్రీలో అవకాశాలు దొరకలేదు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపొచ్చింది. 'లూసిఫర్' రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ సుజీత్ చేసిన మార్పులు చిరంజీవికి నచ్చకపోవడంతో ఆ ఆఫర్ కూడా చేజారింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో సుజీత్ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి.
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'తేరి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సుజీత్. ఇందులో పవన్ కళ్యాణ్ నటిస్తారని అన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కాంబోలో సినిమా కష్టమే. ఫైనల్ గా సుజీత్.. శర్వానంద్ తోనే మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే యువి క్రియేషన్స్ నిర్మాతలు 'తేరి' రీమేక్ ను చరణ్ తో చేస్తే ఎలా ఉంటుందనే ఐడియాను సుజీత్ తో డిస్కస్ చేస్తున్నారట. మరి ఈ రీమేక్ కథకు చరణ్ ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతానికైతే చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram