News
News
X

Balakrishna: బాలయ్యకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ - నిజమేనా?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయబోయే సినిమాకి రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది.  

FOLLOW US: 
Share:

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా బాలయ్య మరో సినిమా ఓకే చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. 

హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. సినిమా బడ్జెట్ కి తగ్గట్లే బాలయ్య భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి బాలయ్యకు రూ.25 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారట. 

'అఖండ' సినిమాకి పది కోట్ల లోపే తీసుకున్న బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా కోసం రూ.18 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకి తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. బాలయ్యకు పాతిక కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ పేచెక్ అని చెప్పాలి. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట.

హీరోయిన్ గా త్రిష:

ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకోవాలనుకుంటున్నారు. కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని ఏలిన త్రిష.. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయింది. అలానే కొన్ని క్లాసిక్ సినిమాలు కూడా చేసింది. రీసెంట్ గా 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో త్రిష చాలా అందంగా కనిపించింది. భారీ క్యాస్టింగ్ ఉన్నా.. అందరి దృష్టి త్రిషపైనే పడింది. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మన దర్శకనిర్మాతలు.

ఈ క్రమంలో బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో ఆమె హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఈ సినిమా చేయడానికి ఆమె రూ.కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని వార్తలొస్తున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. ఈ సినిమా కథ ప్రకారం.. బాలయ్యకి కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. తెలుగమ్మాయి, మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.

బాలయ్యతో ప్రయోగం:

ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ ఈ కోణంలో చూపించలేదని.. తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని.. కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. సినిమా విడుదలైన తరువాత బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనేలా ఉంటుందని తెలిపారు. 

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

Published at : 20 Oct 2022 06:55 PM (IST) Tags: Balakrishna Anil Ravipudi Trisha Balakrishna remuneration

సంబంధిత కథనాలు

Bhootadham Bhaskar Narayana Teaser : దేవుడి గదిలో దిష్టిబొమ్మ - ఆ 16 మంది తలలు ఏమయ్యాయ్?

Bhootadham Bhaskar Narayana Teaser : దేవుడి గదిలో దిష్టిబొమ్మ - ఆ 16 మంది తలలు ఏమయ్యాయ్?

Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?

Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?

Guppedanta Manasu January 28th Update: వసుని సపోర్ట్ చేస్తూ దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, చక్రపాణిని మాట వినిపించుకోని జగతి-మహేంద్ర

Guppedanta Manasu January 28th Update:  వసుని సపోర్ట్ చేస్తూ దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, చక్రపాణిని మాట వినిపించుకోని జగతి-మహేంద్ర

Mahesh Babu : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?

Mahesh Babu : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?

Darshana - Break Up Party : ఆదివారం ఉదయం 'దర్శన', సాయంత్రం కిరణ్ అబ్బవరం 'బ్రేకప్ పార్టీ' 

Darshana - Break Up Party : ఆదివారం ఉదయం 'దర్శన', సాయంత్రం కిరణ్ అబ్బవరం 'బ్రేకప్ పార్టీ' 

టాప్ స్టోరీస్

నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!

నేడు సీబీఐ ముందుకు అవినాష్‌ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్‌ విమానం, సుఖోయ్-మిరాజ్ హెలీకాప్టర్లు

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్‌ విమానం, సుఖోయ్-మిరాజ్ హెలీకాప్టర్లు

Tarak Ratna Health Update: నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మోపై చికిత్స పొందుతున్న తారకరత్న! 

Tarak Ratna Health Update: నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మోపై చికిత్స పొందుతున్న తారకరత్న! 

RBI Governor: బ్యాడ్‌ టైమ్‌ వెళ్లిపోతోందట, గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌

RBI Governor: బ్యాడ్‌ టైమ్‌ వెళ్లిపోతోందట, గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌