Jinthaak Song: దుమ్మురేపుతున్న రవితేజ ఊరమాస్ సాంగ్ 'జింతాక్', స్టెప్పులు అదుర్స్!
రవితేజ హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా ధమాకా. ఈ సినిమాలోని జింతాక్ అనే లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. తెలంగాణ జానపద పాటగా సాగుతూ జనాలను బాగా ఆకట్టుకుంటుంది.
మాస్ మహరాజా రవితేజ తాజా మూవీ ‘ధమాకా’ నుంచి అదిరిపోయే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. సినిమా యూనిట్ ముందుగా ప్రకటించినట్లుగానే ‘జింతాక్’ అనే పాట జనాల ముందుకు వచ్చింది. ఈ పాటలో రవితేజ, శ్రీలీల స్టెప్పులు కెవ్వు పుట్టిస్తున్నాయి. భీమ్స్ సిసిరోయిలో, మంగ్లీ పాడిన ఈ పాట కుర్రకారుకి కిక్కెంచేలా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి జాలు వారిన లిరిక్స్ మాస్ జనాలను ఊపేస్తున్నాయి. ‘‘నిన్ను సూడబుద్ధైంతాంది రాజిగో.. మాట్లాడబుద్ధైతాంది రాజిగో..’’ అంటూ జానపద రీతిలో హుషారుగా సాగిన ఈ పాట జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్.. రవి తేజతో దుమ్మురేపే స్టెప్పులు వేయించారు. అదిరిపోయే సెట్స్ లో అద్భుతమైన డ్యాన్సులతో ఈ పాట ఆద్యంతం జనాలను ఆకట్టుకుంటోంది.
రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోగా రవితేజ కొనసాగుతున్నారు. కొద్ది రోజుల కిందటే రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా జనాల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్ మూవీగా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సత్తా చాటలేకపోయింది. ప్రస్తుతం ఈ మాస్ హీరో త్రినాథరావు నక్కన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా.. చూపిస్త మావ , నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలు తీసి మంచి గుర్తింపు పొందిన నక్కన.. రవితేజ తోనూ బ్లాక్ బస్టర్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ సరసన ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అమ్మడుకు తెలుగులో ఇది రెండో సినిమా.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ధమాకా’ సినిమా.. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఊర మాస్ సాంగ్ ‘జింతాక్’ రిలికల్ సాంగ్ ను జనాల్లోకి వదిలింది చిత్ర యూనిట్. ఈ పాటలో రవితేజ, శ్రీ లీల మాస్ స్టెప్ లు వేశారు. జనాల్లో కొత్త ఊపు తీసుకొచ్చారు. ఈ సాంగ్ జనాలను ఓ రేంజిలో ఊపు ఊపుతుంది. పాట విడుదలైన కొద్ది సేపట్లోనే పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ ఏడాది చివరల్లో ‘ధమాకా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘జింతాక్’’ సాంగ్ ఊపు ఊపుతున్నట్లుగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకోవాలని రవితేజ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అటు ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథను అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోయిలో సంగీతాన్ని అందిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?
Also Read: రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు