News
News
X

Rashmika Mandanna : అతని గుండెలపై రష్మిక ఆటోగ్రాఫ్

ఉత్తరాదిలో రష్మిక క్రేజ్ ఎంత ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 'గుడ్ బై' ప్రమోషన్స్ కోసం ముంబై ఉన్న ఆమె దగ్గర ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి ఫ్యాన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

FOLLOW US: 

రష్మికా మందన్నా (Rashmika Mandanna)ను నేషనల్ క్రష్ అని ఊరికే అనలేదు. సౌత్ ఇండియన్ ఆడియన్స్‌లో మాత్రమే కాదు... నార్త్ ఆడియన్స్‌లో సైతం ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 'గుడ్ బై' సినిమా ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న ఆమెను చూడటం కోసం, ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం ఫ్యాన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్!
'గుడ్ బై' (Goodbye Movie) ప్రోగ్రామ్ కోసం వెళ్లిన రష్మికను ఓ అభిమాని ఆటోగ్రాఫ్ అడిగాడు. 'ఎక్కడ సంతకం చేయాలి' అన్నట్లు ఆమె చూస్తే... తన గుండెలపై చేయమని ఛాతి చూపించాడు అభిమాని. మొదట రష్మిక సందేహించినా... చివరకు, అతడి వైట్ టీ షర్టుపై గుండెల దగ్గర సంతకం చేశారు. అదీ సంగతి! ఆ మధ్య ముంబైలో రష్మిక ఒక గుడికి వెళితే... అభిమానులు చుట్టుముట్టారు. అక్కడ నుంచి రోడ్డు మీదకు ఆమె కారు రావడానికి చాలా సమయం పట్టింది. ఒక దశలో తన ఫ్లైట్ మిస్ అవుతానని రష్మిక కూడా అనుకున్నారు. ముంబైలో ప్రేక్షకులు ఆమెపై అంతలా అభిమానం చూపిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

గోవిందాతో శ్రీవల్లి స్టెప్!
'గుడ్ బై' ప్రమోషన్ కోసం 'డాన్స్ ఇండియా డాన్స్' కార్యక్రమానికి రష్మిక వెళ్లారు. ఆ షో జడ్జ్‌ల‌లో ఒకరు, సీనియర్ హీరో గోవిందాతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. 'పుష్ప' సినిమా హిందీలోనూ భారీ విజయం సాధించింది. అయితే, అంత కంటే ముందు హిందీలో డబ్బింగ్ అయినా సౌత్ సినిమాల ద్వారా పాపులర్ అయ్యారు.
 
News Reels

View this post on Instagram
 
A post shared by ZEE TV (@zeetv)

అమితాబ్ బచ్చన్ కుమార్తెగా...
'గుడ్ బై' సినిమాలో రష్మిక క్యారెక్టర్ విషయానికి వస్తే... అమితాబ్ బచ్చన్ కుమార్తె పాత్రలో ఆవిడ కనిపించనున్నారు. హిందీలో ఆమెకు తొలి చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ చూస్తే... రష్మిక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినట్లు అర్థం అవుతోంది. డీ గ్లామర్ లుక్‌లో ఆమె కనిపించారు. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కంటే రెండు రోజుల ముందు తెలుగులో చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండూ హిందీలోనూ విడుదల కానున్నాయి. అందువల్ల, థియేటర్ల దగ్గర ముక్కోణపు పోటీ ఉండొచ్చు.

Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మిక రెండో హిందీ సినిమా!  
'గుడ్ బై' విడుదలకు ముందే రష్మికకు రెండో హిందీ సినిమా అవకాశం వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా 'మిషన్ మజ్ను'లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు హిందీ సినిమాలతో ఆమెకు ఎటువంటి పేరు వస్తుందో చూడాలి. సౌత్ సినిమాలకు వస్తే... విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న 'వారసుడు' సినిమాలో రష్మిక నటిస్తున్నారు. త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న 'పుష్ప 2' షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. 

Also Read : 'ది ఘోస్ట్' ట్రైలర్ ఎఫెక్ట్ - నాగార్జున నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు

Published at : 27 Sep 2022 08:43 AM (IST) Tags: Rashmika Mandanna Rashmika Autograph Rashmika At Mumbai Good Bye Movie Rashmika Craze In Mumbai

సంబంధిత కథనాలు

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి