అన్వేషించండి

Ranveer Singh: హీరోలకూ లైంగిక వేధింపులు? కాస్టింగ్ కౌచ్ పై రణ్ వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్

సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు మామూలుగా లేవు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఈ అంశాన్ని లేవనెత్తగా, తాజాగా రణ్ వీర్ సింగ్ ఈ లిస్టులో చేశాడు. తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించాడు.

కాస్టింగ్ కౌచ్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన అంశం. ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ కు ఎలా గురయ్యారో చెప్పారు. పలువురు నటీమణులు చెప్పిన విషయాలు సంచలనం అయ్యాయి. పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెప్పారు. వాటిపై కౌంటర్లు, ఎన్ కౌంటర్లు పక్కన పెడితే కొద్ది సంవత్సరాలుగా ఈ అంశం ఇండస్ట్రీలో రగులుతూనే ఉంది. అయితే, ఇప్పటి వరకు లేడీ ఆర్టిస్టులు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అయితే, పురుషులకు కూడా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు ఉంటాయంటూ రణ్ వీర్ సింగ్ వెల్లడించాడు. తనకు ఎదురైన చేదు అనుభవాలు తెలిపాడు. 

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో!

అనుష్క శర్మతో కలిసి ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రణ్‌ వీర్ సింగ్.. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నడు రణ్ వీర్ సింగ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు రణవీర్. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. లూటేరా, గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్, సింబా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. తాజాగా ఈ బాలీవుడ్ అగ్ర హీరో.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో తనకు ఎదురైన షాకింగ్ కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.

కాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకూ ఉన్నాయ్!   

రణ్ వీర్ సింగ్ తాజాగా మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్  19వ ఎడిషన్‌ కు వెళ్లాడు. ఈ వేడుకలో ఎటోయిల్ డిఓర్ అవార్డును అందుకున్నాడు. అవార్డు తీసుకున్న అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించాడు. ‘‘ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఓ వ్యక్తి నన్ను ఈసీడీ ప్రదేశానికి పిలిచి, నువ్వు కష్టపడి పనిచేసేవాడివా? లేదంటే తెలివైన వాడివా? నేను హార్డ్ వర్కర్ అని అనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటల సందర్భంగా అతడు నన్ను డార్లింగ్, బి స్మార్ట్, సెక్సీ లాంటి పదాలతో సంబోధించాడు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి మూడున్నరేళ్లలో నాకు అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు నేను ఈ స్థాయికి చేరాను అనుకుంటున్నాను” అని  రణ్ వీర్ వెల్లడించాడు.   

వరుస సినిమాలతో రణ్ వీర్ సింగ్ బిజీ బిజీ

ఇక రణ్ వీర్ సింగ్ చివరిగా జయేష్‌ భాయ్ ‘జోర్దార్‌’ సినిమాలో కనిపించాడు, ఇందులో షాలిని పాండే, బోమన్ ఇరానీ, రత్న పాఠక్ షా నటించారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులోజాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే, వరుణ్ శర్మ నటిస్తున్నారు.  ఈ మూవీ 1982 నాటి హిందీ చిత్రం ‘అంగూర్’ ఆధారంగా రూపొందించబడుతోంది. అటు కరణ్ జోహార్ మూవీ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లోనూ నటిస్తున్నాడు. ఇందులో అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్‌ కలిసి నటిస్తున్నారు.   

Read Also: అమీర్ ఖాన్‌కు ‘లాల్ సింగ్ చద్దా’ దెబ్బ, నటనకు విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడి!

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget