Maa Elections: ‘మా’ సభ్యులనుద్దేశించి ఆర్జీవీ ట్వీట్... ఘోరంగా అవమానించేశారుగా
ఆర్జీవీ ట్వీట్ చేస్తే ఏదో ఒక సంచలనమో, వివాద నేపథ్యమో కచ్చితంగా ఉంటుంది. ఈసారి ‘మా’పై పడ్డారు ఆర్జీవీ.
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. మాటల తూటాలు, గ్రూపు రాజకీయాలు, తిట్లు, ఏడుపులు... ఇలా నానా హంగామాతో ఎన్నికలు హరోత్తిపోయాయి. ఫలితాలు వచ్చాక కూడా హైడ్రామానే నడిచింది. విష్ణు ప్రమాణ స్వీకారం చేయడం, ఆ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీని పిలవకపోవడం, మరో పక్క ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోని గెలిచిని వాళ్లు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం... ఇవన్నీ సినీఅభిమానులకు కాస్త చికాకు తెప్పించాయి. కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీకి మాత్రం మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చినట్టున్నాయి. ఈసారి మా అసోసియేషన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘సినీ మా అసోసియేషన్ మనుషులు తాము సర్కస్ వాళ్లమని ప్రేక్షకులను రుజువు చేశారు’ అని ట్వీట్ చేశారు. మా ఎన్నికల జరిగిన తీరుపై ఆయనిలా స్పందించారు. ఎన్నికల వేళ లోకల్, నాన్ లోకల్ అనే వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచాడు ఆర్జీవీ.
అంతకుముందు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వివాదంపై కూడా సంచలన ట్వీట్లు చేశాడు ఆర్జీవీ. షారూఖ్ కన్నా ముందే ఆర్యన్ ను మీడియా, ఎన్సీబీలు లాంచ్ చేసేశాయని ట్వీట్ చేశాడు. జైల్లోనే చాలా నేర్చుకుని ఆర్యన్ బయటకు వస్తాడని ట్వీట్లో పేర్కొన్నాడు. అలాగే తాను షారూఖ్ ఖాన్ నిజమైన అభిమానినని, జై ఎన్సీబీ’ అని కూడా పేర్కొన్నారు. ఆర్జీవీకి వివాదాంటే ఎంత ఇష్టమే, వెంటనే స్పందించేస్తాడు అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు నెటిజన్లు.
Also read: పవన్ కళ్యాణ్ వీడియో పోస్ట్ చేసిన మంచు విష్ణు.. ఎవరో కనిపెట్టండి అంటూ..
Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: ఇలాంటి ఆహారపదార్థాలు తింటున్నారా... అయితే మతిమరుపు వచ్చే ఛాన్స్
Also read: బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్దతులు చెబుతున్న ఆయుర్వేదం
Also read: ఆ సమస్యతో బాధపడుతున్న మహిళలకు గర్భనిరోధక మాత్రలతో మేలు