Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వీడియో పోస్ట్ చేసిన మంచు విష్ణు.. ఎవరో కనిపెట్టండి అంటూ..
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదివారం పవన్ కళ్యాణ్ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పుకోండి అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్‌ను రెండు ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు విజయం సాధించిన తర్వాత మెగా ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ మధ్య నెలకొన్న విభేదాలు స్పష్టంగా కనిపించాయి. మోహన్ బాబు వ్యాఖ్యలు సైతం మెగా ఫ్యామిలీకి చురకలు అంటించేలా ఉన్నాయి. నరేష్ నేరుగా చిరు కుటుంబంపై వ్యంగ్య బాణాలు విసిరారు. ఈ పరిణామాలు టాలీవుడ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమైపోతుంది.
విష్ణు మాత్రం ‘మా’ అధ్యక్షుడిగా అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు ఫ్యామిలీపై కామెంట్లు చేయకుండా.. వారిని కూడా కలుపుకుని పోతామని చెబుతున్నారు. ఈ సందర్భంగా మంచు మెగా ఫ్యామిలీ అభిమానులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంచి విష్ణు తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
శనివారం ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు కలుసుకున్నారు. జనసేన అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణు పోస్ట్ చేస్తూ.. వీడియో చివర్లో ఎవరు ఉన్నారో చెప్పుకోండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మీ తండ్రి మోహన్ బాబు తిడతారు. మీరు కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కామెంట్లు చేస్తు్న్నారు.
Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T
— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021
ఆదివారం ‘మా’ అధ్యక్షుడిగా విష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు.. బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరుల ఇంటికెళ్లి మంచు ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానించింది. మంచు విష్ణు ప్యానెల్ నుంచి మొత్తం 15 మంది గెలిచారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి