News
News
X

Arvind Trivedi: రామాయణ్ దృశ్య కావ్యంలోని రావణుడి పాత్రదారి అరవింద్ త్రివేది ఇకలేరు

 రామాయణ్ దృశ్య కావ్యంలో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది ఇక లేరు. గుండెపోటుతో ఆయన మరణించారు.

FOLLOW US: 
 
సినీ పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్‌’. 1980లో ప్రసారమైన ఈ ధారావాహికతో రావణుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు అరవింద్‌ త్రివేది. ఆయన ఇక లేరు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలో ఆయన బాధ పడుతున్నారు. దీనితోపాటు మంగళవారం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. అరవింద్ త్రివేది అంత్యక్రియలు ఇవాళ ముంబయిలో జరగనున్నాయి.  

రావణుడి పాత్రలోని అరవింద్ త్రివేది అందరికీ బాగా గుర్తుండిపోయారు. అనేక గుజరాతీ సినిమాల్లోనూ ఆయన నటించారు. 40 ఏళ్లపాటు గుజరాతీ చిత్ర పరిశ్రమలో ఆయన కొనసాగారు. రామయణ్ మాత్రమే కాదు.. ఈ విలక్షణ నటుడి విక్రమ్ ఔర్ బేతాళ్ సినిమాలో పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోయింది. 

దాదాపు 300లకు పైగా హిందీ, గుజరాతీ చిత్రల్లో అరవింద్ త్రివేది నటించారు. అనేక సామాజిక, పౌరాణిక చిత్రాలలో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు.. 1991 నుండి 1996 వరకు పార్లమెంటు సభ్యుడు కూడా త్రివేది పని చేశారు. సెన్సార్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు విజయ్ ఆనంద్  రాజీనామా చేసిన తరువాత కొంతకాలం తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు.

View this post on Instagram
 
A post shared by Sunil Lahri (@sunil_lahri)

News Reels

అరవిం6ద్‌ త్రివేది ఆరోగ్య పరిస్థితి గురించి కొన్ని రోజుల క్రితం ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఆయన కొవిడ్‌తో మృతి చెందారని వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.   

రామాయణ్.. దూరదర్శన్‌లో 33 ఏళ్ల కిందట ప్రసారమైంది. ఈ సీరియల్ టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్. విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మళ్లీ ప్రసారం చేశారు. మళ్లీ అదే క్రేజ్ తో జనాలు రామాయణ్ సీరియల్ ను ఆదరించారు. హిందీలో ప్రసారమైన ఈ సీరియల్ హిందీయేతర రాష్ట్రాల్లోనూ విశేష ప్రజాభిమానం చూరగొంది.

Also Read: MAA Elections: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

Also Read: Manchu Vishnu: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. నా కుటుంబ సభ్యులను లాగితే మర్యాదగా ఉండదు: విష్ణు వార్నింగ్

Also Read: 'MAA' Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు, ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న విలక్షణ నటుడు

Also Read: 'Akhanda' Movie update: దీపావళికి థియేటర్లలో అఘోరా విశ్వరూపం ఉండబోతోందా...నందమూరి నటసింహం 'అఖండ' సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Oct 2021 08:32 AM (IST) Tags: Ramayan senior actor Avind Trivedi aka senior actor arvind trivedi died Ramayana Circuit Raavan

సంబంధిత కథనాలు

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !