'Akhanda' Movie update: దీపావళికి థియేటర్లలో అఘోరా విశ్వరూపం ఉండబోతోందా...నందమూరి నటసింహం 'అఖండ' సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్
నందమూరి అభిమానులకు దీపావళి ట్రీట్ ఇచ్చేందుకు బాలకృష్ణ సిద్ధమయ్యారా. ఆ సందడేంటో చూద్దాం..

నందమూరి నట సింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేష్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్టందుకోవడంతో ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఉగాది సందర్భంగా విడుదలైన 'అఖండ' టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అతి తక్కువ సమయంలోనే 50మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే..ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారట. త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుందని టాక్.
THE MIGHTY #AKHANDA WRAPS UP SHOOT ♥️ WITH A SONG . Going to ROAR 🦁 BIG TIME IN THEATRES SOON ⚡️⚡️
— thaman S (@MusicThaman) October 5, 2021
THE BLOCKBUSTER COMBINATION OF #NBK GAARU & #BOYAPATI GAARU #BB3 🦁ARE READY FOR A HATRICK 💥💥💥
God bless !! ⭐️ pic.twitter.com/GVOLFLnv8f
‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఒకటి అఘోరా పాత్ర. ఇప్పటికే ఈ సినిమా నుంచి అడిగా అడిగా అంటూ విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య సరసన 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా పూర్ణ నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ లెజెండ్ సినిమాలో జగపతిబాబును పవర్ ఫుల్ గా చూపించిన బోయపాటి ఈ సినిమాలో శ్రీకాంత్ క్యారెక్టర్ ని కూడా అలాగే డిజైన్ చేశాడట. ఈ సినిమాలో తన పాత్ర చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటుందని, గతంలో అలాంటి పాత్రలో తనని ఎప్పుడూ చూసి ఉండరని శ్రీకాంత్ ఇప్పటికే చెప్పాడు. మరోవైపు జగపతిబాబు కూడా బాలయ్య లానే 'అఘోరా' గా కనిపించనున్నాడని టాక్.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు, సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడయ్యాయని చెబుతున్నారు. డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
'అఖండ' షూటింగ్ పూర్తి కావడంతో బాలయ్య 'క్రాక్' డైరక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. గోపిచంద్ గతంలో 'డాన్ శీను', 'బలుపు', 'పండగ చేస్కో 'లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన 'క్రాక్' బాగా ఆకట్టుకుంది. లేటెస్ట్ మూవీలో బాలయ్యని ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రగా చూపించనున్నాడని సమాచారం. నందమూరి నటసింహం సరసన మరోసారి త్రిష హీరోయిన్ గా నటించనుందని టాక్. మొత్తానికి 'అఖండ'తో వస్తానంటూ దీపావళికి తమ అభిమాన హీరో మంచి ట్రీట్ ఇస్తున్నారంటున్నారు నందమూరి అభిమానులు.
Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...
Also Read: బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK
Also Raed: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు, ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న విలక్షణ నటుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

