RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
మార్చి 24న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. ఇండియాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి క్రేజ్ దక్కింది. ఇప్పటికీ ఈ సినిమాను పొగుడుతూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు నెటిజన్లు.
మార్చి 24న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా.. సౌత్ లాంగ్వేజ్ వెర్షన్స్ అన్నీ జీ5లో రిలీజ్ అయ్యాయి. ఓటీటీ రిలీజ్ కి కూడా బాగానే ప్రమోషన్స్ చేసుకున్నారు. జీ5 అయితే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను హయర్ చేసుకొని ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కూడా ప్రమోషన్స్ విషయంలో కొత్త రూట్ లో వెళ్తోంది.
ఈ సినిమాకి సంబంధించి పలు పోస్ట్ లను సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేయడంతో పాటు.. సొంత వీఎఫ్ఎక్స్ ను వాడుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో రామ్, భీమ్ 'నాటు నాటు' సాంగ్ కి స్టెప్స్ వేస్తూ కనిపించారు. అయితే ఈ స్టెప్స్ ను ఫుట్ బాల్ కి సింక్ చేస్తూ.. గ్రాఫిక్స్ సహాయంతో మన హీరోల కాళ్లపై ఫుట్ బాల్ ఉండేలా డిజైన్ చేశారు.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'రామ్, భీమ్ చేయలేనిది అంటూ ఉంటుందా..?' అంటూ క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ కి వీళ్లను రికమెండ్ చేయాలని కొందరు.. ఎడిటింగ్ లెవెల్ ఓ రేంజ్ లో ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్
Also Read: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్
View this post on Instagram