(Source: ECI/ABP News/ABP Majha)
Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరంజీవి, రాజేంద్రప్రసాద్ నివాళులు అందించారు.
జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌కు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ నివాళులర్పించారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయన ద్వారా తను మద్రాస్ ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యానని.. ఆయన్ని దేవుడిలా భావిస్తానని.. మా ఇంట్లో ఒక మనిషాయన.. మీ తోటి ఉన్న వారిలో పది మందికి సహాయం చేయండి.. అదే ఆయనకు ఘన నివాళి అని చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ.. ''కొన్నేళ్లు ఆయన పక్కన ఉన్న వ్యక్తినీ. సమాజమే దేవాలయం.. అన్న మనిషి అతను. మన కళ్ల ముందు మనం చూసిన దేవుడు ఆయన. ఈరోజు మా పెద్దాయన బతికి ఉండి ఉంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని. అలాంటి జన్మ మళ్లీ తెలుగు ప్రజలు ఎప్పుడు చూస్తారో'' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రజలతో పాటు చాలా మంది సెలబ్రిటీలు తమ అభిమాన కథానాయకుడు, మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో ''తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి'' అంటూ రాసుకొచ్చారు.
Also Read: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
Also Read: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022
View this post on Instagram