Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ
Super Star Krishna Ghattamaneni Birthday Special Interview: మే 31న సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
కృష్ణ ఘట్టమనేని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు (Mahesh Babu)... తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తానూ సూపర్ స్టార్ అని అనిపించుకున్నారు. ఇప్పుడు ఏంటి? మహేష్ చిన్నతనంలోనే సూపర్ స్టార్. బాల నటుడిగా తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే, అప్పుడు మహేష్ బాబుతో యాక్ట్ చేయించడానికి ఎన్ని తిప్పలు పడిందీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కృష్ణ గుర్తు చేసుకున్నారు.
మహేష్ బాబుతో సినిమాలు ప్లాన్ చేయలేదని, అలా జరిగిందని కృష్ణ చెప్పారు. ''ఒకసారి షూటింగ్ చూడటానికి స్టూడియోకి వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే... దూరంగా మెట్ల మీద కూర్చున్నాడు. 'యాక్ట్ చేస్తావా?' అని అడిగితే... చేయనని మారం చేశాడు. స్టూడియో అంతా పరుగులు పెట్టించాడు'' అని కృష్ణ తెలిపారు.
Krishna remuneration for Gudachari 116 Movie: మే 31న సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని పుట్టినరోజు. ఈ సందర్భంగా కుమార్తె మంజులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను కృష్ణ వెల్లడించారు. 'గూఢచారి 116' చిత్రానికి వెయ్యి రూపాయలు పారితోషికం ఆఫర్ చేసి, కాంట్రాక్ట్ మీద సంతకం చేయమని నిర్మాతలు అడిగినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
సినిమా హీరో అవ్వడం కోసం ఏ ఉద్యోగం చేయనని ఇంట్లో చెప్పేసి అలా ఖాళీగా ఉన్నానని కృష్ణ తెలిపారు. ప్రస్తుతం పని లేకుండా బయటకు వెళ్లనని, ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. అందం తనకు భగవంతుడు ఇచ్చిన వరం అన్నారు.
మంజుల సినిమాల్లో నటించడం ఇష్టం లేని అభిమానులు నానా గొడవ చేశారని అప్పటి సంగతులను కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పూర్తి ఇంటర్వ్యూ మే 31న యూట్యూబ్ లో విడుదల కానుంది.
View this post on Instagram