అన్వేషించండి
Advertisement
Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ సందర్భంగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తన పీరియడ్ స్టోరీ గురించి చిన్న షార్ట్ ఫిల్మ్ లో చెప్పుకొచ్చింది.
ఈరోజు వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ సందర్భంగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తన పీరియడ్ స్టోరీ గురించి చిన్న షార్ట్ ఫిల్మ్ లో చెప్పుకొచ్చింది. ఆ విధంగా నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దీపికా పదుకోన్ తన చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంది.
''నా బెస్ట్ ఫ్రెండ్ దివ్య నేను కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరి మదర్స్ కలిసి పీరియడ్స్ గురించి మాకు చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఆ సమయంలో దివ్య వాళ్ల మదర్ పీరియడ్స్ అంటే ఏంటి..? అలా ఎందుకు జరుగుతాయనే విషయాల గురించి చెప్పారు. ఆ మొత్తం సంభాషణ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఆమె కూడా ఎంతో సహనంగా, అర్ధమయ్యే విధంగా చెప్పారు. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫ్యూచర్ లో నేను కూడా నా పిల్లలకు, నా చుట్టూ ఉండే పిల్లలకు అదే విధంగా అవగాహన కల్పిస్తాను'' అంటూ చెప్పుకొచ్చారు.
చాలా మంది పిల్లల్లో పీరియడ్స్ కి సంబంధించి సందేహాలు ఉంటాయి. కానీ కొందరు పేరెంట్స్ ఈ విషయాలను ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడరు. అలా చేయడం వలన కొందరు పిల్లలకు పీరియడ్స్ సమయంలో ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు హైజీన్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఆ పద్ధతి మారాలని, పిల్లల్లో అవగాహన కల్పించాలని 'Nua Woman' అనే సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ సంస్థకు సపోర్ట్ గా నిలిచింది దీపికా పదుకోన్.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion