‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ అంటూ రామ్ చరణ్‌తో కలసి స్టెప్పులేసిన అక్షయ్ కుమార్
ఇటీవల రామ్ చరణ్ ఢిల్లీ లోని ఓ ప్రయివేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడకు బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. రామ్ చరణ్ తన నటనతో విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన డాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇటీవల రామ్ చరణ్ ఢిల్లీలోని ఓ ప్రయివేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడకు బాలీవుడ్ నటుడు అక్షయ కుమార్ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దానితో పాటు స్టేజ్ మీద ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ‘‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’’ అనే పాటకు రామ్ చరణ్ స్టెప్పులేశారు. ఆయన స్టెప్పులు చూసి అక్షయ్ కుమార్ సైతం కాలు కదిపారు. చరణ్ తో కలిసి ఆ పాటకు డాన్స్ చేశారు. అలాగే రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మా.. మంగమ్మా.. పాటకు అక్షయ్ చరణ్ తో కలసి స్టెప్పులేశారు. వీరి డాన్స్ అక్కడ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. అలాగే ఈ ఢిల్లీ టూర్ లో రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయి. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.
RRR సినిమా దేశవ్యాప్తంగా భారీ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ కు క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా తో రామ్ చరణ్ కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈ సినిమాను జపాన్ లో విడుదల చేసారు. అక్కడ ప్రమోషన్స్ లో కూడా చరణ్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఆర్.సి 15 అనే వర్కింగ్ టైటిల్ ను కూడా పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి చేసింది మూవీ టీమ్. ఇక తర్వాత షెడ్యూల్ త్వరలో న్యూజిలాండ్ లో ప్రారంభం అవ్వనుంది టాక్. RC15లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే తెలుస్తోంది. ఓ పాత్రలో ముఖ్యమంత్రి గా మరో పాత్రలో ఎన్నికల అధికారిగా చెర్రీ కనిపిస్తారని అంటున్నారు.
శంకర్ సినిమాలు ఎలా తెరకెక్కిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పొలిటికల్ బ్యాగ్డ్రాప్ సినిమాలు అయితే శంకర్ టేకింగ్ వేరే లెవల్ లో ఉంటుందనే చెప్పాలి. ఈ సినిమాను కూడా అదే స్టైల్ లో తీస్తున్నారట. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. శ్రీకాంత్ , అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని వినికిడి. ఇప్పటినుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
Best moment of the day... @AlwaysRamCharan dances on the tunes of Tu Cheez Badi Hai Mast Mast with @akshaykumar. #HTLS2022 #RamCharan #AkshayKumar pic.twitter.com/3oMENZ73cP
— Monika Rawal (@monikarawal) November 12, 2022