Wealthiest Veteran South Indian Actors: రజనీకాంత్ To చిరంజీవి, దక్షిణాదిలో అత్యంత సంపన్నులైన నటులు, వారి ఆస్తుల విలువెంతో తెలుసా?
సౌత్ లో పలువురు సినీ నటులు అత్యంత సంపన్నులుగా కొనసాగుతున్నారు. సినిమాలకు తోడు వ్యాపారాలు, ఎండార్స్ మెంట్స్ తో భారీగా సంపాదిస్తున్నారు. దక్షిణాదిలో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
సినిమాల్లో రాణిస్తూనే వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు పలువురు హీరోలు. సినిమాలు, ప్రకటనల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తున్నప్పటికీ, పలు రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. అన్ని చోట్లా రాణిస్తూ బాగానే డబ్బు వెనుకేసుకుంటున్నారు. దక్షిణాది సినీ ప్రేమికులు రజనీకాంత్, చిరంజీవి వంటి తారాలను ఎంతగా ఆధరిస్తారో తెలిసిందే. అందుకే వారు ఇప్పటికీ ఆ రంగంలో రాణిస్తూ నేటి తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. మరి మన దక్షిణాదిలో ఏయే నటులు ఎంత సంపాదించారు? వారి నికర ఆస్తుల విలువ ఎంతో చూద్దాం.
1. మమ్ముట్టి - రూ. 340 కోట్లు
మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఐదు దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో మళయాల సినీ అభిమానులను అలరిస్తున్నారు. CA నాలెడ్జ్ ప్రకారం రూ.340 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం. మలయాళం కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా ఉండటంతో పాటు తన ప్రొడక్షన్ బ్యానర్ - మమ్ముట్టి కంపెనీ కింద సినిమాలు నిర్మించి భారీగా డబ్బును సంపాదిస్తున్నట్లు తెలిసింది.
2. మోహన్ లాల్ - రూ.376 కోట్లు
మెగాస్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మలయాళ సూపర్ స్టార్ రూ.376 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. కేవలం నటనే కాదు, ఫుడ్, హాస్పిటాలిటీ, ఫైనాన్స్ రంగాలలో భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా బాగా ఆదాయాన్ని అర్జిస్తున్నట్లు తెలిసింది. కొచ్చిలో హోటల్‌ను ప్రారంభించడం ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టారు. తన స్వంత చలనచిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ మాక్స్ ల్యాబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ప్రారంభించాడు.
3. కమల్ హాసన్ - రూ.388 కోట్లు
దేశంలోని దాదాపు అన్ని చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన తమిళ స్టార్ కమల్ హాసన్.. ‘విక్రమ్’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. కమల్ తన తదుపరి చిత్రానికి రూ.150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసి అంత పెద్ద అమౌంటా, అసాధ్యం అని ఆయన అభిమానులే నోరెళ్లబెడుతున్నారు. ఈ వెటరన్ స్టార్ నికర ఆదాయ విలువ రూ.388 కోట్లు అని సమాచారం.
4. రజనీకాంత్ - రూ.430 కోట్లు
తలైవాగా ప్రసిద్ధి చెందిన భారతీయ సూపర్ స్టార్ రజనీకాంత్, తన తదుపరి చిత్రం ‘జైలర్’ కోసం రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఈ సీనియర్ నటుడి నికర ఆస్తుల విలువ రూ.430 కోట్లు. చెన్నై పరిసరాల్లోని పోయెస్ గార్డెన్‌లో రూ.35 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఆయనకు ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ జి వ్యాగన్, లంబోర్గినీ ఉరస్ వంటి సూపర్ విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
5. నాగార్జున - రూ.950 కోట్లు
సినిమాలతో పాటు చిత్రనిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు టాలీవుడ్ హీరో నాగార్జున. తన నికర విలువ రూ.950 కోట్లు. రెస్టారెంట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చుట్టుపక్కల ఆస్తులను కలిగి ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ రూ.42.3 కోట్ల విలువైనది.
6. చిరంజీవి - రూ.1,650 కోట్లు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విలువైన విలాసవంతమైన విల్లా ఉంది. దాని విలువ రూ.28 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. చిరంజీవి ఇటీవల బెంగళూరులో కొత్త విలాసవంతమైన బంగళాను తీసుకున్నారు. రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. ఈయన నికర ఆస్తుల విలువ రూ.1,650 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళాశంకర్’ సినిమాలు చేస్తున్నారు.
Read Also: రూ.7 లక్షలకు కొన్న ఇల్లు ఇప్పుడు రూ.కోట్లు - ఇదీ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్