By: ABP Desam | Updated at : 14 Oct 2021 09:27 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రజనీకాంత్ అన్నాత్తే సినిమా టీజర్ విడుదల అయింది.
రజినీకాంత్ హీరోగా, దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. నవంబర్ 4వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను నిర్మాతలు దసరా సందర్భంగా విడుదల చేశారు. టీజర్ నిడివి ఒక నిమిషం 44 సెకన్లు ఉంది. గ్రామంలో జరిగే వేడుకల విజువల్స్‌తో ప్రారంభం అయిన టీజర్ వెంటనే యాక్షన్ టర్న్ తీసుకుంది.
టీజర్‌లో యాక్షన్, ఎలివేషన్ సీన్లు చూస్తుంటే.. వింటేజ్ రజనీకాంత్‌ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. టీజర్ చివర్లో రజనీకాంత్ నడుచుకుంటూ వస్తుంటే.. పక్కన లారీలు గాల్లోకి ఎగిరే షాట్ టీజర్‌కు హైలెట్ అని చెప్పవచ్చు. డి.ఇమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్‌కు బాగా ప్లస్ అయింది. ఈ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసే విధంగా టీజర్ కట్ చేశారు.
ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు. తెలుగులో కూడా నవంబర్ 4వ తేదీనే ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌కు ‘పెద్దన్న’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మీనా, కుష్బూ, నయనతార, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, కమెడియన్లు సూరి, సతీష్, అభిమన్యు సింగ్ కూడా నటిస్తున్నారు.
ఇంత భారీ స్టార్‌కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. విశ్వాసం వంటి సూపర్ హిట్ తర్వాత శివ రూపొందిస్తున్న సినిమా కావడంతో దీని కోసం తమిళ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లాంచ్ అయిన టీజర్‌లో కూడా విశ్వాసం చాయలు లీలగా కనపడుతున్నాయి. హీరో గెటప్, రూరల్ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఫుల్‌గా చూపించారు.
2019లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. కరోనా వైరస్, రజనీకాంత్ ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన అన్నాత్తే టైటిల్ సాంగ్ పెద్ద హిట్ అయింది. రజనీకాంత్‌కు బాలసుబ్రమణ్యం పాడిన ఆఖరి పాట ఇదే. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. నవంబర్ 4వ తేదీన తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు కాబట్టి తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.
Also Read: 'అంత ఇష్టం ఏందయ్యా' పవన్ ని ఓరగా చూస్తోన్న నిత్యామీనన్
Also Read: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం