Rajeev Kanakala: ఆమాట విని తారక్ సీరియస్ అయ్యారు, రామ్ చరణ్ బ్రేక్ తీసుకుందాం అన్నారు - రాజీవ్ కనకాల
Rajeev Kanakala: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి నటుడు రాజీవ్ కనకాల పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వారిద్దరితో కలిసి నటించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
Rajeev Kanakala About Jr NTR And Ram Charan: గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు సీనియర్ నటుడు రాజీవ్ కనకాల. వారిద్దరితో సినీ జర్నీలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిలాయన్నారు. “‘ఆంధ్రావాలా’ షూటింగ్ జరుగుతోంది. సెట్ లో ఒక రూమ్ లాంటిది ఉంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ఎమ్మెస్ నారాయణ, నేను కూర్చున్నాం.. జూనియర్ ఎన్టీఆర్ చిన్నసీన్ షూట్ కోసం వెళ్దాం అన్నారు. నాతో రా అని నన్ను పిలిచారు. నేను మందు వెళ్తాను. మీరు తర్వాత రండి. మీతో వస్తే బాగోదు కదా అన్నాను. ప్రతి దానికి నువ్వు ఎంతో దూరం ఆలోచిస్తావు, నాతో రావాల్సిందే అని తనతో పాటు తీసుకెళ్లారు. దీంతో ఓ ఆర్టిస్టు, ఏంటి రాజీవ్ నువ్వు హీరోతోనే వస్తావా? మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నువ్వు మాత్రం హీరోతోనే వస్తున్నావ్? అన్నాడు. సీరియస్ గా కాదు, సరదాగానే! జూనియర్ ఎన్టీఆర్ టక్కున సీరియస్ అయ్యారు. ఏ సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావ్ అన్నా? ఆయన ఎప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాడో తెలుసా? అయినా, తనను నేనే పిలిచాను ఏంటిప్పుడు? అన్నాడు. ఆ మాటతో అందరూ సైలెంట అయ్యారు” అని చెప్పారు.
ఆ రోజు సుమ అక్కడికి వెళ్లలేకపోయింది - రాజీవ్
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జూనియర్ నటన పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగారని రాజీవ్ తెలిపారు. “‘నిన్ను చూడాలని’ నుంచి ‘RRR’ వరకు ఆయనలో ఎన్నో మార్పులు ఉన్నాయి. పూర్తిగా మారిపోయారు. ‘స్టూడెంట్ నెం 1’లో బొద్దుగా ఉన్న వ్యక్తి, ఆ తర్వాత మరింత బరువు పెరిగి, ‘యమదొంగ’ సినిమాతో పూర్తిగా సన్నబడిపోయారు. ఆ తర్వాత ఆయన కెరీర్ ఓ రేంజిలో ఎదిగిపోయింది. ‘ఆంధ్రావాలా’ ఆడియో లాంచ్ ఈవెంట్ ను గుడివాడలో ఏర్పాటు చేశారు. 4 రైళ్లు స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేశారు. ఏకంగా 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. చిన్న ఊరు సినీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. అప్పట్లోనే ఆయన ఆ స్థాయి అభిమానులను సంపాదించుకున్నారు. యాంకర్ సుమ ఆ కార్యక్రమం కోసం వెళ్లింది. కానీ, ఆ జనాల్లో ఆమె స్టేజి మీదకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఆయన స్థాయి పెరుగుతూ వెళ్లింది. జూనియర్ ఎన్టీఆర్ కు చాలా భాషలు తెలుసు. వాళ్ల అమ్మది కర్ణాటక కావడంతో కన్నడ చక్కగా మాట్లాడుతారు. తమిళం కూడా మాట్లాడుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతారు” అని చెప్పారు.
‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నా, ‘దేవర’ గురించి తెలియదు- రాజీవ్
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పిన రాజీవ్, ‘దేవర’లో ఉంటానో? లేదో? తెలియదన్నారు. “ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన చాలా సినిమాల్లో చేశాను. ‘దేవర’లో ఉంటానో? లేదో? తెలియదు. ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాను. చరణ్ తో కలిసి ‘నాయక్’ సినిమా చేశాను. ‘రంగస్థలం’ చేశాను. కానీ, అప్పుడు పెద్దగా మాట్లాడలేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయనతోనే ఉంటాను. అన్ని సీన్లలో కనిపిస్తాను. శంకర్ గారు నా జుట్టుకు నల్లరంగు వేయమని చెప్పారు. నేను షాక్ అయ్యాను. షూటింగ్ జరిగేప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాను. నాలుగు టేకులు తీసుకున్నాను. నేను నటన మర్చిపోయానా? అని షేక్ అయ్యాను. రామ్ చరణ్ తో సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది. అప్పుడు కూడా చేయలేకపోయాను. చెర్రీ నన్ను కంగారు పడకండి. అసరమైతే బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ప్రోత్సహించాడు. చాలా మంచి మనిషి తను” అని తెలిపారు.
Read Also: రవితేజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాలి - ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన దిల్ రాజు